బాలకృష్ణ బోయపాటిమూవీ ప్రాజెక్ట్ కు పూజా కార్యక్రమాలు జరిగినా ఈ మూవీ షూటింగ్ రకరకాల కారణాలతో వాయిదా పడుతున్న విషయం తెలిసిందే. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీ షూటింగ్ ను ఫిబ్రవరి నుండి పరుగులు తీయించాలని బోయపాటి భావిస్తున్నట్లు టాక్.

ఈ సినిమాకు సంబంధించిన బడ్జెట్ సమస్యలు ఒక కొలిక్కి రావడంతో ఈ మూవీ నటీనటుల ఎంపిక విషయమై బోయపాటి ఆలోచనలు చేస్తున్నాడు. అయితే ఇప్పటికీ ఈ మూవీ స్క్రిప్ట్ విషయమై బోయపాటికి బాలయ్యకు మధ్య చిన్న గ్యాప్ కొనసాగుతోంది అన్న ప్రచారం జరుగుతోంది.

మూవీ స్క్రిప్ట్ ఫైనల్ అయినప్పటికీ ఈ మూవీ క్లైమాక్స్ విషయంలో బాలయ్యకు బోయపాటికి చిన్న గ్యాప్ ఉంది అని అంటున్నారు. ఈ విషయాల పై చర్చలు కొనసాగిస్తూనే ఈ మూవీ షూటింగ్ ను వచ్చే నెల నుండి మొదలు పెట్టబోతున్న పరిస్థితులలో షూటింగ్ ను వేగంగా పూర్తి చేసి ఈ ఏడాది దసరా సీజన్ కు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేయమని బోయపాటి కి బాలయ్య స్పష్టమైన సూచనలు ఇచ్చాడు అని అంటున్నారు. 

ఇదే దసరా సీజన్ ను దృష్టిలో పెట్టుకుని చిరంజీవి కొరటాల మూవీ ప్రభాస్ రాథా కృష్ణల మూవీలు రెడీ అవుతున్న పరిస్థితులలో అంత భారీ పోటీ మధ్య విడుదల చేయడం ఇష్టం లేక దసరా సీజన్ కాకుండా మరో పోటీ లేని సోలో డేట్ ను చూసుకుందామని బోయపాటి చెపుతున్నట్లు టాక్. అయితే బాలయ్య ఒత్తిడికి బోయపాటి తల ఒగ్గె పరిస్థితులు ఏర్పడితే మరొకసారి చిరంజీవి బాలకృష్ణల ఫైట్ తో దసరా సీజన్ వేడెక్కే ఆస్కారం ఉంది. దీనితో ఈ ఫైట్ మధ్య ప్రభాస్ కూడ తల దూరుస్తాడా లేకుంటే అతడు కూడ వేరే డేట్ ను ఎంచుకుని చిరకాల ప్రత్యర్ధులైన బాలయ్య చిరంజీవిల ఫైట్ ను ఎంజాయ్ చేస్తాడా అన్నది రానున్న రోజులలో తేలిపోతుంది..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: