సంక్రాంతి వచ్చింది అంటే పెద్ద పండగ వచ్చినట్టే. సంక్రాంతి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా పండగ చేసుకుంటూ ఉంటారు. అయితే అదే సంక్రాంతికి టాలీవుడ్ నుంచి అనేక సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అలా రిలీజ్ అయ్యే వాటిలో చాలా వరకు మంచి విజయాలు సొంతం చేసుకుంటూ ఉంటాయి. ఈ ఏడాది ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజ్ కాగా అందులో మూడు సూపర్ హిట్ అయ్యాయి. రజినీకాంత్ దర్బార్, మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సినిమాలు మంచి విజయాలు సొంతం చేసుకున్నాయి.
అయితే, వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా మరికొన్ని సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇందులో కొన్ని పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పటి నుంచి వచ్చే సంక్రాంతికి పోటీ పెరిగిపోతున్నది. అందులో మహేష్ బాబు... వంశి పైడిపల్లి కాంబినేషన్లో సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమా మే నుంచి సెట్స్ మీదకు వెళ్తుందట. ఇందులో మహేష్ కౌబాయ్ తరహాలో కనిపిస్తారని టాక్.
ఇకపోతే, ఈ సినిమాతో పాటుగా అల్లు అర్జున్... సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న కొత్త సినిమా కూడా సంక్రాంతికి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఎలాగైనా సంక్రాంతికి తీసుకొచ్చి మరో హిట్ కొట్టాలని బన్నీ కసితో ఉన్నాడు. ఈ ఏడాది ఈ ఇద్దరు పోటీ పడ్డారు. రెండు సినిమాలు విజయం సాధించాయి. కాగా, వచ్చే ఏడాది కూడా ఈ ఇద్దరు పోటీ పడబోతున్నారు. వీరితో పాటుగా ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కబోయే అయినను పోయిరావలె హస్తినకు సినిమా కూడా సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నారు.
గతేడాది ఎన్టీఆర్ సినిమా ఒక్కటి కూడా రాలేదు. దీంతో ఈ ఏడాది ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా భారీ విజయం సాధించే అవకాశం ఉన్నది. అటు బాలయ్య కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి తన సినిమాను తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఇలా చాలామంది నటులు వచ్చే ఏడాది సంక్రాంతిని టార్గెట్ చేసుకున్నారు. ఎన్ని సినిమాలు 2021 సంక్రాంతికి వస్తాయో చూడాలి.