సమంత అక్కినేని, శర్వానంద్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం `జాను`. తమిళంలో విడుదలై సంచలన విజయాన్ని సాధించిన '96' మూవీని తెలుగులో 'జాను' పేరుతో రీమేక్ చేస్తున్నారు. విజయ్ సేతుపతి, త్రిష కలిసి నటించిన ఈ చిత్రం తమిళ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే తెలుగులో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఒరిజినల్ వెర్షన్‌ను డైరెక్ట్ చేసిన సి. ప్రేమ్ కుమార్ తెలుగులోనూ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌, టీజర్‌, ట్రైల‌ర్ అభిమానులను తెగ ఆకట్టుకోవ‌డంతో సిన‌మాపై మంచి క్రియేట్ అయింది.

 

ఈ సినిమాను ప్ర‌పంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 7న విడుదల చేసేందుకు చిత్ర బృదం సన్నాహాలు చేస్తుంది. గోవింద్‌ వసంత్‌ సంగీత సమకుర్చారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో చిత్రబృందం ప్రమోషనల్ కార్యక్రమాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో టీజ‌ర్‌, పాటలు ఇలా ఒక్కోటి విడుద‌ల చేస్తూ.. సినిమాపై మంచి బ‌జ్ ఏర్పాటు అయ్యేలా చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఓవర్సీస్‌ హక్కులను ప్రైమ్ మీడియా మంచి డీల్‌కు కుదుర్చుకుంది. జాను ఓవర్సీస్ రైట్స్‌ను రూ.2 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తుంది. దీంతో ఈ డీల్ చాలా మంచిదని చిత్ర యూనిట్ వెల్లడించింది.

 

దీనిని బ‌ట్టీ చూస్తుంటే స‌మంత క్రేజ్ సినిమాకు బాగానే ప్ల‌స్ అయిందంటున్నారు కొంద‌రు. కాగా, ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా యూత్‌ను ఆకట్టుకోవడం ఖాయమని ఇప్ప‌టికే చిత్ర యూనిట్ ధీమా వ్య‌క్తం చేసింది. అలాగే ఈ చిత్ర‌ ట్రైలర్‌లో క‌డా మంచి ఎమోషనల్ ఫీల్తో ఒరిజినల్ ఫ్లేవర్‌కు ఏమాత్రం తగ్గకుండా శర్వానంద్, సమంతలు జీవించేస్తున్నారు. టీనేజ్ లవ్ స్టోరీతో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉంది. అలాగే  శర్వానంద్, సమంత కెమిస్ట్రీ కూడా బాగానే ఉంది. మ‌రి ఈ చిత్రం తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎంత వ‌ర‌కు రీచ్ అవుతుందో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: