చిరంజీవి సినిమాల టైటిల్స్ ను అతడి సినిమాలలోని పాటలను రీమిక్స్ చేయడానికి మెగా హీరోలు కూడ భయపడిపోతు ఉంటారు. అయితే ఎటువంటి భయం లేకుండా చిరంజీవి సినిమాల టైటిల్స్ ను ఇప్పుడు తమిళ హీరోలు వరస పెట్టి వాడుకోవడం ఇండస్ట్రీ వర్గాలలో హాట్ న్యూస్ గా మారింది. 

ఈమ‌ధ్య‌నే తమిళ హీరో కార్తీ సినిమాలు రెండు వ‌ర‌స‌గా మెగా స్టార్ చిరంజీవి సినిమాల టైటిల్స్ ను వాడుకుంటూ విడుద‌ల అయ్యాయి. ‘ఖైదీ’ ‘దొంగ‌’ ఇలా ఈ రెండు సినిమాలూ చిరంజీవి ని మెగా స్టార్ గా మార్చిన సినిమాలు. వాటిల్లో ‘ఖైదీ’ సినిమా టైటిల్ కార్తికి కలిసి వస్తే ‘దొంగ’ మాత్రం అడ్ర‌స్ లేకుండా పోయింది.

అయినా చిరంజీవి సినిమా టైటిళ్ల‌ను తమిళ సినిమాల హీరోలు వాడుకోవడం ఆగడం లేదు. త‌మిళంలో టాప్ హీరోగా పేరుపొందిన జీవా నటించిన ఒక మూవీని ప్రస్తుతం తెలుగులోకి డబ్ చేస్తున్నారు. ఈ మూవీకి ‘స్టాలిన్’ అన్న పేరు పెట్టినట్లు తెలుస్తోంది. అదేవిధంగా తమిళ హీరో విజయ్ సేతుపతి నటించిన మరొక సినిమాను ‘అందరివాడు’ టైటిల్ తో తెలుగులో డబ్ చేస్తున్నారు. 

దీనితో చిరంజీవి సినిమాల టైటిల్స్ కు ఏర్పడిన మ్యానియా ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవి నటించిన ‘సైరా’ ను తమిళ ప్రేక్షకుడు చూడకపోయినా తమిళ హీరోలు మాత్రం చిరంజీవి సినిమా టైటిల్స్ పై మోజు పడటం ఆయన మ్యానియాను సూచిస్తోంది. వాస్తవానికి మెగా అభిమానులు చాలామంది రామ్ చరణ్ ను చిరంజీవి సినిమా టైటిల్స్ ను తన సినిమాలకు పెట్టుకోమని సూచిస్తున్నా అతడు ఆ సాహసాన్ని చేయలేకపోతున్నాడు. అయితే చిరంజీవి సూపర్ హిట్ మూవీ ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్ పెట్టుకుని నాని ఎంత ప్రయత్నించినా హిట్ దక్కలేదు. ఇలాంటి పరిస్థితులలో ఈ డబ్బింగ్ సినిమాలను ఎంత వరకు చిరంజీవి టైటిల్స్ మ్యానియా రక్షిస్తుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: