రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అప్పటి వరకు పూరి జగన్నాథ్ పని అయిపోయిందనుకున్న వారందరికీ ఇస్మార్ట్ శంకర్ తో తానేమ్టో నిరూపించాడు. ఇక ఈ సినిమాలో రామ్ నటనకి మంచి మార్కులు పడ్డాయి. అప్పటి వరకూ సాఫ్ట్ రోల్స్ చేసిన రామ్ ఒక్కసారిగా గల్లీ కుర్రోడిగా మాస్ పాత్రలో కనిపించి ప్రేక్షకులకి ఆనందాన్ని పంచాడు.

 

 

సినిమా తర్వాత రామ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్ అనే సినిమా చేస్తున్నాడు, కిషోర్ తిరుమలతో ఇదివరకే రెండు సినిమాలు చేసి ఉన్నాడు. నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ చిత్రాలు కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కినవే. అయితే ఆ రెండు చిత్రాలు సాఫీగా సాగిపోయే కథలే. కానీ ప్రస్తుతం తెరకెక్కుతున్న రెడి సినిమా అలా ఉండదట. మాస్ ప్రెజంట్రేషన్స్ తో చాలా కొత్తగా ఉంటుందని సమాచారం.

 

 

రెడ్ సినిమా తమిళ చిత్రమైన తాడంకి రీమేక్ అని అంటున్నారు. రామ్ మొదటిసారి డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ చిత్రం కోసం దాదాపు ముగ్గురు హీరోయిన్స్ ని ఎంపిక చేశారు. నివేదా పేతురాజ్ మెయిన్ లీడ్ హీరోయిన్ గా చేస్తుండగా, మాళవిక శర్మ, అమృత అయ్యర్ కూడా నటిస్తున్నారు. కాగా రామ్ ఇమేజ్ కి తగ్గట్టుగా ఒరిజినల్ కథకి చాలా మార్పులే చేశారట దర్శకుడు. హీరోయిన్ రోల్ నిడివి కూడా మరి కొంచెం పెంచినట్టు తెలుస్తుంది . 

 

 

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మాస్ లో మంచి ఆదరణ దక్కించుకున్న రామ్ కి తగ్గట్టుగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారట. అందుకోసం ఒరిజినల్ కథలో కొన్ని మార్పులు చేశారట. ఈ సినిమాలో హీరోయిన్స్ పాత్ర చాలా తక్కువగా ఉంటుందట. అన్నదమ్ముల మధ్య రైవల్రీ.. క్రైమ్ సస్పెన్సు ప్రధానంగా చిత్రం నడుస్తుందని అంటున్నారు. ఇక రెడ్ చిత్రాన్ని స్రవంతిగి రవి కిషోర్ నిర్మిస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: