బాహుబలి సినిమా చేస్తున్నప్పుడు చాలామంది కేవలం ఒక్క సినిమా కోసమే ఐదేళ్ళు వేస్ట్ చేయడం అని అనుకునే ఉంటారు. పైకి చెప్పకపోయినా చాలా మంది హీరోలు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. అయితే ఒక్కసారిగా బాహుబలి రిలీజై కలెక్షన్ల మీద కలెక్షన్లు సాధిస్తుంటే కానీ అర్థం కాలేదు ఐదేళ్ల శ్రమ ఏంటనేది. తెలుగులో చేసిన బాహుబలి అన్ని భాషల్లో విడుదల అయ్యి, విడుదలైన చోటల్లా ఇండస్ట్రీ హిట్ రికార్డును సొంతం చేసుకుంది.

 

 

అంతే కాదు ప్రభాస్ నేషనల్ స్టార్ అయిపోయాడు. కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ కి అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా జపాన్ లో ప్రభాస్ అభిమానులు బాగా ఉన్నారు. బాహుబలి బ్లాక్ బస్టర్ కావడంతో ప్రభాస్ కి అక్కడ విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. జపాన్ వారు ప్రభాస్ బర్త్ డే సందర్భంగా హైదరాబాద్ వరకి వచ్చారంటే జపాన్ లో ప్రభాస్ క్రేజ్ ఏంటనేది అర్థం చేసుకోవచ్చు.

 

 

అయితే ఈ క్రేజ్ బాహుబలితోనే ఆగిపోలేదు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సాహో సినిమా తెలుగు వారికి నచ్చలేదు కానీ బాలీవుడ్ జనాలు నెత్తినపెట్టుకున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో జపాన్ వారు కూడా చేరిపోయారు. ఇటీవల సాహో సినిమా జపాన్ లో విడుదల అయింది. ఈ సినిమా జపాన్ వారికి బాగా నచ్చిందట. ప్రభాస్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా సాహో సినిమాని అక్కడ ఎక్కువ థియేటర్లలోనే విడుదల చేశారు.

 

 

విడుదల అయిన ప్రతీ దగ్గర నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందట. తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ సినిమా విడుదల అయితే ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎంజాయ్ చేస్తూ చూస్తారో అక్కడ కూడా థియేటర్లలో సాహో చిత్రాన్ని జపనీస్ ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇకముందు ప్రభాస్ సినిమాలకి ఇక్కడ మంచి బిజినెస్ ఏర్పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: