పుట్టిన ప్రతి వ్యక్తి ఏదో ఒక సమయంలో మరణిస్తారు.  పుట్టిన వ్యక్తి మరణించక తప్పదు.  మరణించిన వ్యక్తి తిరిగి పుట్టక తప్పదు.  అనివార్యమగు దీని గురించి చింతించడం తగదు అని భగవత్గీత చెప్తోంది.  ఈ విషయాన్ని బాగా వంటపట్టించుకున్న వ్యక్తులు దీని గురించి ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  పైగా ఎవరు కూడా దీని గురించి కామెంట్స్ కూడా చేయరు. చావు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ పెద్దగా తెలియదు.  తెలియని విషయం గురించి పెద్దగా ఎవరూ కూడా పట్టించుకోరు అనే సంగతి తెలిసిందే.  


ఇకపోతే, సినిమా రంగంలోకి నచ్చావులే సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి విజయం సొంతం చేసుకొని, ఇప్పుడు రాజకీయాల్లో సత్తా చాటుతున్న హీరోయిన్ మాధవీలత తన ఆరోగ్యం గురించిన కొన్ని విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  తాను ఎంతోకాలం బ్రతకనని త్వరలోనే చనిపోతానని పేర్కొన్నది. ప్రేమ సినిమాలో హీరోయిన్ రేవతిలా తానెప్పుడూ మందులు వేసుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయని, నిత్యం ఏదో ఒక మెడిసిన్ వాడాల్సిన ఆవశ్యతక వచ్చినట్టు ఆమె చెప్పింది.  


మైగ్రేన్, జలుబు, జ్వరం, నిద్రలేమి ఇవే తనను ఎంతగానో బాధపెడుతున్నాయని అంటోంది.  ఇలా బాధపెట్టడం వెనుక కారణం ఏంటి అనే విషయం గ్రహించకుండా మెడిసిన్స్ వాడుతూ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటోంది మాధవీలత.  ఎక్కువగా టెన్షన్ పడటం, ఎక్కువగా ఆలోచించడం వంటి వాటి వలన నిద్రలేమి వస్తుంది.  ఇది మనిషిని సగం చేస్తుంది.  అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా నిద్రకు ప్రాధాన్యత ఇవ్వాలి.  


అలా ప్రాధాన్యత ఇస్తేనే మనిషి మనిషి నుంచి కాపాడుకుంటాడు.  మనిషి కోసం మనిషి అని, తప్పకుండా అందరు సహాయం చేస్తారని అంటున్నారు నెటిజన్లు.  ఎవరు ఎన్ని చెప్పినా ఆమె ధోరణి మాత్రం మారడం లేదు.  సరే మరణం వచ్చినపుడు దానిని ఎవరూ కూడా అడ్డుకోలేరు. ఇది వాస్తవం.  అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని, మెడిసిన్ ఉపయోగించి మరణాన్ని అడ్డుకోలేరు.  ఆ సమయం వచ్చినపుడు అన్ని అవే జరిగిపోతుంటాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: