టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి పదేళ్ల విరామం తర్వాత వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150 ’ మూవీతో హీరోగా రీ ఎంట్రీ ఇచ్చారు.  ఈ మూవీలో రైతులు పడుతున్న ఆవేదన కళ్లకు కట్టినట్టు చూపించారు. దాంతో ఈ మూవీ అంచనాలు దాటి సూపర్ సక్సెస్ అందుకుంది.  ఇక మాస్ ఎలిమెంట్స్ తో చిరంజీవి చేసిన సందడి తో మెగా ఫ్యాన్స్ థియేటర్లో కేరింతలు కొట్టారు.  ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ తర్వాత తొలి తెలుగు పోరాట యోధుడు ఉయ్యాల వాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ‘సైరా’ మూవీలో నటించాడు.  ఈ మూవీకి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించారు. రూ.300 కోట్లకు పైగా ఖర్చు చేసిన ఈ మూవీ తెలుగు, కన్నడ, మళియాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేశారు. అయితే మూవీ మాత్రం అనుకున్న స్థాయిలో హిట్ కాలేకపోయింది. 

 

ప్రస్తుతం మెగాస్టార్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీలో నటిస్తున్నారు.  ఇప్పటికే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లి షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సమ్మర్ కి రిలీజ్ చేసే యోచనలో ఉన్నారు. దేవాలయాల మాఫియా నేపథ్యంలో ఈ ఉండబోతున్నట్లు టాలీవుడ్ టాక్. అయితే ఇటీవల గద్దల కొండ గణేష్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న హరీష్ శంకర్ మరోసారి మెగా హీరోతో సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. గతంలో పవన్ కళ్యాన్ తో గబ్బర్ సింగ్ మూవీ తీసి బాక్సాఫీస్ హిట్ అందుకున్నాడు.   సాయిధరమ్ తేజ్ తో 'సుబ్రహ్మణ్యం ఫర్ సెల్' సినిమా తెరకెక్కించాడు.

 

ఈ సినిమాకూడా మంచి టాక్ ను సొంతంచేసుకుంది. అల్లు అర్జున్ తో 'డీజే' ఇక వరుణ్ తేజ్ తో 'గద్దలకొండ గణేష్' సినిమాతో మరో బ్లాక్ బాస్టర్ అందుకున్నాడు. ఇప్పుడు మెగాస్టార్ కి ఓ కథ వినిపించారట. మంచి కథతో వస్తే అవకాశం ఇస్తానని చిరు మాటిచ్చినట్లు తెలుస్తోంది. దాంతో చిరంజీవి కోసం ఒక పవర్ ఫుల్ స్టోరీ ని రెడీ చేస్తున్నాడని తెలుస్తుంది. ఇదే జరిగితే.. ఆ మూవీ హిట్ అయితే.. హరీష్ శంకర్ రేంజ్ ఎక్కడికో వెళ్తుందని అంటున్నారు సినీ వర్గాలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: