టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా శ్రీను వైట్ల ఎంతో మంచి పేరు సంపాదించారు.  ఆనందం, సొంతం, వెంకీ, ఢీ, రెడీ, కింగ్, దూకుడు లాంటి మూవీస్ తో బాక్సాఫీస్ హిట్ అందుకున్నాడు దర్శకులు శ్రీను వైట్ల.  ఏ హీరో, హీరోయిన్, దర్శకుడికైనా బ్యాడ్ టైమ్ వస్తే కెరీర్ ఇబ్బందుల్లో పడుతుందన్న మాట తెలిసిందే.  ఈ నేపథ్యంలో శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ఆగడు, రామ్ చరణ్ నటించిన బ్రూస్ లీ ఆ మద్య రవితేజ హీరోగా నటించిన ‘అమర్ అక్బర్ ఆంథోని’ ఈ మూడు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి.  దాంతో శ్రీను వైట్ల కెరీర్ పూర్తిగా కష్టాల్లోపడింది.  ఇదిలా ఉండగా శ్రీను వైట్ల, రచయిత కోన వెంకట్ లది సూపర్ హిట్ కాంబినేషన్ అంటారు.  గతంలో వీరి కాంబినేషన్ లోవచ్చిన సినిమా మంచి విజయాలు అందుకున్నాయి. 

 

దూకుడు తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తి విడిపోయారు. ఓ చిత్రానికి సంబంధించిన క్రెడిట్ విషయంలో వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడినట్లు కోన వెంకట్ ఓ సందర్భంలో తెలిపారు.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో కోన వెంకట్ మాట్లాడుతూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమ అంటేనే సక్సెస్, ఫెయిల్యూర్స్ ఉంటాయని... తాను తప్పుకోవడం వల్లే శ్రీను వైట్లకు సక్సెస్ దూరమైందనే మాట తాను అనబోనని అన్నారు.   శ్రీను వైట్లలో మంచి ట్యాలెంట్ ఉంది. అతడి కామెడీ టైమింగ్ చాలా బావుంటుంది.  ఎలాంటి నటుల నుంచి ఎలాంటి నటన రాబట్టాలో తెలిసిన లౌక్యం శ్రీను వైట్లకు ఉందని అన్నారు.  

 

కానీ ప్రస్తుతం అతడి సినిమాలు ఫ్లాప్ కావడానికి కారణం కథల ఎంపిక అని నేను అనుకుంటున్నా. ఇండస్ట్రీలో సక్సెస్, ఫెయిల్యూర్ శాశ్వతం కాదు. ప్రస్తుతం నాకు శ్రీను వైట్లపై ఎలాంటి కోపం లేదు అని కోన వెంకట్ అన్నారు. ఎవరితోనూ జీవితాంతం విభేదాలు ఉంచుకోకూడదు అని కోన వెంకట్ అన్నారు.  భవిష్యత్ లో  రాసే కథకు శ్రీను వైట్ల మాత్రమే సరైన దర్శకుడు అని భావిస్తే అతడికి ఫోన్ చేస్తానని కోన వెంకట్ అన్నారు. కాకపోతే అతని మనసులో నాపై ఎలాంటి భావన ఉందో మాత్రం నాకు తెలియదని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: