ఇటీవల సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమాతో యావరేజ్ విజయాన్ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవి, ప్రస్తుతం వరుస సక్సెస్ ల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ పాత్ర ఎంతో పవర్ ఫుల్ గా ఉండనున్నట్లు టాక్. మెగాస్టార్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇటీవల షూటింగ్ మొదలైన ఈ సినిమా, ప్రస్తుతం శరవేగంగా ముందుకు సాగుతోంది. తన గత సినిమాల మాదిరిగా కొరటాల ఈ సినిమాని కూడా మంచి మెసేజ్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నట్లు టాక్. 

 

ఇకపోతే దీని తరువాత మెగాస్టార్ నటించబోయే సినిమాపై ఇప్పటికే పలు వార్తలు ప్రచారం అవ్వగా, నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి బయటకు వస్తున్న వార్తను బట్టి, మెగాస్టార్ తన తదుపరి సినిమాని గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ తో చేయనున్నట్లు టాక్. ఇటీవల కొన్నాళ్ల క్రితం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో కలిసి హరీష్ తెరకెక్కించిన గద్దలకొండ గణేష్ సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అయితే కొద్దిరోజుల క్రితం ఒక కార్యక్రమంలో భాగంగా మెగాస్టార్ ని హరీష్ కలిసాడని, అయితే అదే సమయంలో నీ దగ్గర ఏదైనా మంచి కథ ఉందా అని మెగాస్టార్ అడిగారని, సిద్ధంగా లేకపోతే సిద్ధం చేయి, 

 

తప్పకుండా సినిమా చేద్దాం అని చెప్పడం జరిగిందని, సో ఆ మాటలకు పొంగిపోయిన హరీష్, ఇటీవల కొన్నాళ్లుగా మంచి కథ సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు టాక్. స్వతహాగా మెగాస్టార్, పవర్ స్టార్ లకు మంచి అభిమాని అయిన హరీష్ కూడా మెగాస్టార్ తో ఒక సినిమా చేయాలని ఎప్పటినుండో చూస్తున్నాడు, ఇక అనుకోకుండా ఆ అవకాశం రావడంతో ఎట్టిపరిస్థితుల్లో దానిని బాగా సద్వినియోగం చేసుకునేందుకు మంచి పవర్ఫుల్ కథను సిద్ధం చేస్తున్నాడని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయో తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే...... !!

మరింత సమాచారం తెలుసుకోండి: