జబర్దస్త్ ఈ పేరు చెప్పగానే టక్కున గుర్తుకు వచ్చే పేరు నాగబాబు రోజా తర్వాతా అంతా గుథింపూ పొందిన వ్యక్తి హైపర్ ఆది. ఆది ఏ ముహూర్తాన జబర్దస్త్  లో అడుగు పెట్టాడో  గాని జబర్దస్త్ రేటింగ్ అమాంతం అలా అలా పెరిగిపోయింది. కేవలం ఆది స్కిట్స్ చూసి జబర్దస్త్ కట్టేసి పడుకొనే జనాలు ఉన్నారు. 

 

     ఆది స్కిట్ మొదలయింది అంటే పంచుల జడివాన మొదలయినట్టే. అంతలా తన పంచులతో జడ్జెస్ తో పాటు ఆడియన్స్ ను అలరిస్తుంటాడు ఆది. ఆది తన స్కిట్ లో ఎక్కువగా  కరెంటు న్యూస్ నే వాడుతుంటాడు. పొలిటికల్ సెటైర్స్ వేస్తూ అందరినీ విస్మయానికి గురిచేయడం మన వాడికి పంచులతో  పెట్టిన విద్య..  

 

      రీసెంట్ గా జబర్దస్త్ వాళ్లు వదిలిన ప్రోమో లో మన వాడు ఒక రేంజ్ లో రెచ్చిపోయాడు. హిట్ సినిమా అయినటువంటి అల వైకుంఠపురంలో మూవీ గెటప్ వేసి మన వాడు చేసిన అల్లరి, వేసిన పంచులతో జబర్దస్త్ సెట్ అంతా నవ్వులతో హోరెత్తిపోయింది..

 

     అల్లు అర్జున్ మాదిరే వేషం వేసిన ఆది ఓ చేతిలో కోడి మరో చేతిలో కొడవలితో ‘సిత్తరాల సిరపడు’ పాటతో ఎంట్రీ ఇచ్చాడు. ‘నేను అల్లు అర్జున్‌ని కానని కోడికి కూడా తెలిసిపోయినట్లుంది. అసలు చేతిలో ఉండట్లేదు’ అని ఆది వేసిన పంచ్‌లు అందరూ పగలబడి నవ్వుకున్నారు. ఆ తర్వాత ఆ కోడిని పట్టుకుని అనసూయ వద్దకు వెళ్లాడు. ‘నిన్ను చూస్తే కోడే ఆగట్లేదు. ఇక పకోడీ గాళ్లం మేమెలా ఆగుతాం’ అని ఆది పేల్చిన జోక్ తో అనసూయ మూసి మూసి నవ్వులతో, జడ్జెస్ రోజా ఇచ్చిన మైండ్ బ్లోయింగ్ ఎంట్రీ అని కాంప్లిమెంట్ తో అల  అల సాగిపోయింది ప్రోమో..

 

మరింత సమాచారం తెలుసుకోండి: