టాలీవుడ్ లో కొంతమంది హీరోలు అనుకోకుండా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాలు అందుకుంటారు. అలాంటి వారిలో శర్వానంద్ ఒకరు. ప్రతిరోజూ జూబ్లీహిల్స్‌లో బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేసే సమయంలో  నటుడు ఆర్యన్ రాజేష్ తో పరిచయం ముంబైలోని కిషోర్ నమిత్ కపూర్ నటనకు సంబంధించిన కోర్స్ లో చేరడం జరిగిందట. పరిశ్రమలో పెద్దగా ఎవరితోనూ పరిచయం లేదు. దీంతో సొంతంగానే ప్రయత్నాలు మొదలుపెట్టాడు.   స్రవంతి రవికిషోర్ 'యువసేన' సినిమాలో నలుగురు హీరోల్లో ఒక పాత్ర ఇచ్చారు. అది హిట్టవడంతో మంచి పేరొచ్చింది కానీ సోలోగా అవకాశం రాలేదు. అప్పుడే 'శంకర్ దాదా ఎంబీబీఎస్'లో మరో పాత్ర. ఆ తరవాత 'సంక్రాంతి', 'లక్ష్మి' సినిమాల్లో వెంకటేష్ తమ్ముడిగా చేశాడు.

 

'రాజు మహారాజు'లో మోహన్‌బాబుతో కలిసి నటించాడు. ఇలా చిన్న చిన్న పాత్రల్లో నటించిన శర్వానంద్ 'సంక్రాంతి' తరవాత 'వెన్నెల' సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది. ఆ తరవాత వచ్చిన 'అమ్మ చెప్పింది'లో మానసికంగా ఎదగని కుర్రాడి పాత్ర. ఇతడు చేసిన వాటిల్లో చాలా కఠినమైంది అదే అని ఇతని అభిప్రాయము. 'గమ్యం'తో ఇతని నట జీవితము పూర్తిగా మారిపోయింది.  'గమ్యం' తమిళ రీమేక్‌లోనూ నటించాడు. శర్వానంద్ కి రన్ రాజా రన్ తర్వాత మంచి సక్సెస్ లు కలిసి వచ్చాయి. శతమానంభవతి లాంటి ఫ్యామిలీ ఎంట్రటైన్ మెంట్ తో మంచి విజయం అందుకున్నాడు.  

 

శర్వానంద్ జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలను చేస్తున్న విషయం తెలిసిందే.  నెక్స్ట్ ఈ హీరో జాను సినిమాతో రాబోతున్నాడు. సమంత కథానాయికగా నటించిన ఆ సినిమా తమిళ్ మూవీ 96కి రీమేక్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.నేను శైలజా - చిత్రలహరి వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కిషోర్ ప్రస్తుతం రామ్ తో రెడ్ అనే థ్రిల్లర్ సినిమాని చేస్తున్నాడు. . రొమాంటిక్ అంశాలతో పాటు మంచి మెస్సేజ్ ఇచ్చే పాయింట్ ని రాసుకున్న దర్శకుడు ఇదివరకే కొంత మంది హీరోలకు ఆ కథను వినిపించాడట. అయితే ఫైనల్ గా ఆ కథకు శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: