టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోల్లో ముందు నుంచి నాగ శౌర్య కి సపరేట్ గా ఒక ఇమేజ్ ఉంది. అదే క్లాస్ హీరో అని. హీరో గా నటించిన మొదటి సినిమా ఊహలు గుస గుసలాడే సినిమాతో మంచి సక్సస్ ని అందుకున్నాడు. వాస్తవంగా శౌర్య సినిమాకి భారీ అంచనాలు, పెద్ద హడావుడి అంటూ ఏమీ ఉండదు. కానీ కాస్తో కూస్తో క్రేజ్ మాత్రం ఉంటుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో కాస్త ఆసక్తి ఉంటుంది. మంచి సినిమా చూద్దాం అన్న ఆసక్తి థియోటర్స్ లో శౌర్య సినిమా కి లాక్కొస్తుంది. అయితే ఛలో సినిమాతో నాగశౌర్య కి మంచి మార్కెట్ టాలీవుడ్ లో తనకంటూ ఒక గుర్తించు బాగా పెరిగింది. 

 

సినిమా మంచి కమర్షియల్ హిట్ గా నిలిచింది. దాంతో శౌర్య తన సొంత బ్యానర్ లోనే ఎక్కువగా సినిమాలు చేయడానికి ప్లాన్ చేసుకున్నాడు. అందులో భాగంగా నిర్మించినదే నర్తనశాల. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఇక తాజా చిత్రం కూడా తన సొంత బ్యానర్ లోనే నిర్మించాడు. అదే అశ్వద్ధామ. ఈ సినిమాతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాగశౌర్య. రమణ తేజ దర్శకత్వంలో ఈ సినిమాను ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై నాగ శౌర్య తల్లి ఉషా నిర్మించారు. ఈ సినిమాలో నాగ శౌర్యకు జోడీగా మెహ్రీన్ కౌర్ నటించింది. అయితే మొదటి షో నుండే సినిమాకి గట్టిగా నెగిటివ్ టాక్ వినిపించింది.

 

ప్రస్తుతం సమాజంలో ఆడవాళ్ల మీద జరుగుతున్న అఘాయిత్యాలను ఆధారంగా చేసుకొని ఈ కథ తయారు చేసుకున్నట్టు నాగ శౌర్య ఇది వరకే తెలిపాడు. కథ, కథనాలు రెగ్యులర్ సినిమాల పంథాలో సాగడం తో ఆడియ్నస్ కి చిర్రెత్తుకొస్తుందట. ఫస్ట్ హాఫ్ వరకు స్క్రీన్ ప్లే జస్ట్ ఓకే గా ఉంది తప్ప అంత సేపు సినిమాలో ఏం చూపించారో ఎలా చూశామో అన్న భావనలో ఆడియన్స్ ఉన్నారట. అసలు ఇంట్రవెల్ ట్విస్ట్ ఏంటి ఎందుకా ట్విస్ట్ అంటూ బుర్ర గోక్కుంటున్నారట. ఇక సెకండ్ హాఫ్ అయితే మరీ దారుణమని ఎప్పుడెప్పుడు లేచి వెళదామా అంటూ కూర్చున్నారట.

 

ఇక ప్రస్తుతం సమాజంలో ఆడవాళ్ల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద హీరో నాగ శౌర్య స్వయంగా ఈ సినిమా కథ సిద్ధం చేయడం బాగానే ఉంది. అందులోను తన స్నేహితుడి చెల్లికి జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా కథ రాసుకున్నాడు. దాంతో సినిమా ట్రైలర్ చూస్తే మాత్రం సినిమాలో విషయం ఉన్నట్టుగానే అనిపించింది. కానీ మార్నింగ్ షో పడ్డ తర్వాత నుండే ఇలా డివైడ్ టాక్ రావడం చూస్తుంటే నాగశౌర్య కి భారీ ఫ్లాప్ పడినట్టే అన్న టాక్ వినిపిస్తుంది. ఇక కొంతమంది ఆడియన్స్ అయితే ఈ సినిమాని రేపు అమేజాన్, నెట్ ఫ్లిక్స్ లో కూడా చూడరని మొహమాటం లేకుండా చెబుతున్నారట.  రైటర్ గా ఛలో తర్వాత తన పెన్ పవర్ ఏంటో చూపించిన నాగ శౌర్యసినిమా సక్సెస్ అయితే రైటర్ గా కూడా కొనసాగేలా ఉన్నాడు.   

మరింత సమాచారం తెలుసుకోండి: