ఆయనో స్టార్ ప్రొడ్యూసర్.. డిస్ట్రిబ్యూటర్ గా ఎదిగి నిర్మాతగా మారి ప్రస్తుతం తెలుగు సిని పరిశ్రమలో యాక్టివ్ ప్రొడ్యూసర్ గా సూపర్ ఫాంలో ఉన్నాడు. స్టార్ ఎవరైనా.. బడ్జెట్ ఎంతైనా.. డైరక్టర్ ఎవరైనా పండుగ సీజన్ వచ్చే సినిమాలకు ఆయన చెప్పిందే ఫైనల్ రేటు.. సినిమా బడ్జెట్.. స్టార్ కాస్ట్ ఇవన్ని చూసి ఆయన తను కొనే ఏరియాల రేటు ఫిక్స్ చేస్తాడు. దానికి నిర్మాతలు ఒప్పుకుంటేనే అంతా సవ్యంగా జరుగుతుంది లేదంటే ఆ సీన్ వేరేలా ఉంటుంది.

 

అయితే ఈయనకు ఓ వీక్ నెస్ కూడా ఉంది. మంచి సినిమా అనిపిస్తే పరాయి భాష సినిమా అయినా సరే కొనేస్తాడు. అక్కడ కూడా తన తెలివితేటలు వాడుతాడు అనుకోండి. సినిమా నిర్మాత ఇలా ఉంటాడా అన్న మాటకి సమాధానంగా ఇది చెయొచ్చు.. అది చెయ్యకూడదు అన్నదేది లేకుండా అన్నిటిని తన మీద వేసుకునే ఓ రకంగా అన్నిటిపై అతనికున్న మోజుతో అతను సినిమాలు చేస్తాడని చెప్పొచ్చు. అంతేకాదు కథ విషయంలో నిర్మాత జోక్యం అసలు ఉండదు. అది మిగతా వాళ్ల సినిమాలు కాని ఇక్కడ సీన్ రివర్స్ ఆయన చేసే సినిమాలకు డైరక్టర్స్ కు కూడా సలహా ఇచ్చే రేంజ్ మనోడిది. 

 

పాతిక సినిమాల నిర్మాణ అనుభవం ఆయన్ను ఇలా సక్సెస్ బాటలో నడిపించేలా చేస్తున్నా దర్శకుడి సృజనాత్మకతకు అడ్డుగా ఉంటాడని కూడా కొందరు లోపల అనుకునే మాట. అంతేకాదు బడ్జెట్ కంట్రోల్.. షెడ్యూల్.. కాస్టింగ్ ఇలాంటి విషయాల్లో బాగా ఇన్వాల్వ్ అవుతాడట. సినిమాలో నటీనటుల గురించి నిర్మాత ఇన్వాల్వ్ మెంట్ సాధారణంగా అవసరం ఉండదు కాని ఇక్కడ మాత్రం అది ఉంటుంది. ఏది ఏమైనా ఆయన పెట్టె ప్రతి రూపాయికి పది రూపాయలు రావాలని అనుకుంటాడు. అందుకే నిర్మాత అయినా ఆయన సినిమా మొత్తం ఓ ప్రొడక్షన్ మేనేజర్ గా కష్టపడతాడు. ఈయన చేసేది కరెక్టా రాంగా అన్నది పక్కన పెడితే డిస్ట్రిబ్యూటర్ కం ప్రొడ్యూసర్ గా ఈయన హవా మాత్రం తెలుగులో కొనసాగుతుందని మాత్రం చెప్పొచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: