మీరు సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా విహరించే వ్యక్తులు అయితే ఈరోజు నుండి అందరూ చైనాలోని జంతువుల మార్కెట్ ఫోటోలు పెట్టి వారిని కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి కారకులుగా చేసి అనేక రకాలుగా మాట్లాడడం మరియు కామెంట్లు చేయడం గమనించే ఉంటారు. ముందుగా కరోనా వైరస్ చైనా నుండి ప్రబలింది అనడం వాస్తవమే. కానీ చైనా వారి ఆహారపు అలవాట్లను మరియు వారు ఏది పడితే అది తింటారు, చిత్రవిచిత్రమైన ఆహార అలవాట్లు కలిగి ఉంటారు అని వారిని తప్పుబట్టడం మాత్రం తప్పు అని కొందరు అంటున్నారు.

 

చైనా వారు నిజంగానే రకరకాల జీవ చర్యలను భుజిస్తారు. వారు మనలో అత్యధిక శాతం మంది భయపడే బొద్దింకలను కమ్మగా ఫ్రై చేసుకుని లేదా పులుసు పెట్టుకుని తినేస్తారు. ఇక వారు పట్టు పురుగు లను కూడా వారి ఆహారంలో భాగంగా తీసుకుంటారు. అనేక రకమైన పక్షులు, ఇంకా పాకేవి, ఎగిరేవి, దూకేవి, గెంతేవి, కాళ్ళు ఉన్నవి, లేనివి ఇలా ఎన్నో రకాల జీవాలను భుజించడం అక్కడ వారికి తరతరాలుగా వస్తూనే ఉంది. ఇక వారు కుక్కలని కోసుకొని కూర వండుకొని తినేస్తారు. పాము యొక్క రక్తాన్ని గ్లాసులో వేసుకొని గటా గటా తాగేస్తారు. అలా తాగే లోపే పాముని ముక్కలు ముక్కలుగా చీల్చి మీకు నచ్చినట్లు వండి పెడతారు.

 

వారు అలా తినడం వల్లే కరోనా వైరస్ వచ్చింది అనుకుంటే ఇది ఎన్నో శతాబ్దాల ముందు వచ్చి ఉండేది. అదే కనుక జరిగితే మెరుగైన వైద్య చికిత్స మరియు టెక్నాలజీ అందుబాటులో లేకపోవడం వల్ల ఇప్పటికే మన ప్రపంచ జనాభాలో సగం ఉండేది కాదు. కాబట్టి చైనా వారు కూడా తప్పు ఎక్కడ జరిగింది మరియు వైరస్ మొట్టమొదట ఎక్కడి నుండి ఉద్భవించింది అన్న విషయం పై ఇంకా పరిశోధనలు చేస్తూ ఉన్నారు.

 

అలా అని చెప్పి దీనికి చైనా వారిని బాధ్యులను చేయడం కరెక్ట్ అయినా నెపంతో వారిని దూషించడం మరియు వారి ఆహార వ్యవహారాలలో కించపరచడం తప్పు అన్నది కొంతమంది మాట. మన దేశంలో కూడా ఎలుకలను పిల్లలను మరియు కొన్ని చోట్ల పందికొక్కులు కూడా తింటారు. అలా అని ఒక జాతి ఆహార వ్యవహారాల కించపరచడం తప్పు కదా...!

మరింత సమాచారం తెలుసుకోండి: