టాలీవుడ్ సినిమా పరిశ్రమకు వచ్చి మంచి పేరు దక్కించుకుని ఒక వెలుగు వెలిగిన నటీమణుల్లో సిల్క్ స్మిత కూడా ఒకరు. నిజానికి ఆమె మొదట్లో సినిమాల్లో హీరోయిన్ గా కంటే ఎక్కువగా ప్రత్యేక గీతాల్లో నర్తించేవారు. సిల్క్ స్మిత అసలు పేరు వడ్లపాటి విజయలక్ష్మి. ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు లో జన్మించిన స్మిత, చిన్న వయసులోనే కుటుంబ ఆర్ధిక పరిస్థితుల వలన చదువు మానేశారు. ఆ తరువాత ఒకింత యుక్త వయసు వచ్చిన అనంతరం ఆమెకు వివాహం చేసారు ఆమె తల్లితండ్రులు. ఆ తరువాత నటనపై మక్కువతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె మొదట టచప్ ఆర్టిస్ట్ గా రావడం జరిగింది. ఆ తరువాత అక్కడక్కడా సినిమాల్లో చాలా చిన్న పాత్రల్లో నటించిన స్మిత, తొలి సినిమా మలయాళంలో 1979లో వచ్చిన ఇనయే తేడి, ఆ తరువాత అదే భాషలో పుష్యరాగం, ఒటపెట్టావర్ అనే సినిమాల్లో నటించారు. అనంతరం స్మితకు తమిళ సినిమా వండిచక్కరం లో బార్ గర్ల్ రోల్ దక్కింది. ఇక అదే సమయంలో ఆమె పేరు స్మిత గా మార్చబడింది. ఇక అక్కడినుండి పలు మలయాళ, తమిళ సినిమాల్లో నటించిన స్మిత, ఆపై వచ్చిన సీతాకోకచిలుక ద్వారా నటిగా తెలుగు భాషలో పరిచయం అయ్యారు. 

 

ఇక ఆ తరువాత నుండి ఆమె సెక్స్ అపీల్ నచ్చిన పలువురు దర్శకులు ఆమెకు వ్యాంప్ పాత్రలనే ఎక్కువగా ఇచ్చే వారు. అనంతరం మెల్లగా పలు వ్యాంప్ క్యారెక్టర్స్ తో పాటు ఆ తరహా సాంగ్స్ లో నటించడం మొదలెట్టిన స్మితకు అప్పటి యువత, మాస్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. మొత్తంగా తన 18 సంవత్సరాల మూవీ కెరీర్ లో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో 450కి పైగా చిత్రాలలో 506కి మించి డ్యాన్సులు చేసింది స్మిత. వీటిలో కొన్నిచిత్రాల్లో చక్కని నటననూ ప్రదర్శించి విమర్శకుల ప్రశంసలు ఆమె పొందింది. అయితే స్మిత ఆ తరువాత నిర్మాతగా మారి పలు సినిమాలు కూడా నిర్మించారు. అయితే ఆమె కెరీర్ మంచి పీక్స్ లో ఉన్నపుడు ఒక డాక్టర్ తో స్మితకు పరిచయం ఏర్పడడం, అది ఒకింత ప్రేమగా మారి చివరికి పెళ్లి చేసుకోవాలని వార్ నిర్ణయించుకునేదాకా వెళ్లిందట. అయితే అదే అదునుగా తీసుకున్న సదరు డాక్టర్, ఆమె నుండి అవసరాలకు డబ్బులు తీసుకోవడం, వాటిని విచ్చలవిడిగా ఖర్చుచేయడం చేసేవాడట, అది మాత్రమే కాక మధ్యలో ఆమెను కొంత టార్చర్ కూడా చేసేవాడట. అయితే ఆ తరువాత సినిమా నిర్మాణం ప్రారంభించి సినిమాలు తీసి, 

 

తద్వారా పని లేని కళాకారులకు మంచి పని కల్పించడంతో పాటు కొత్తగా సినిమాలోకి రావాలనుకునేవారికి అవకాశాలు కూడా ఇవ్వాలని భావించిన స్మిత ఆలోచనలు ఎక్కువ రోజులు ముందుకు సాగలేదట. దానికి కారణం ఆమె నిర్మించిన సినిమాలు వరుసగా పరాజయాలు పాలవడం. ఇక మెల్లగా ఒక్కొక్కటిగా ఆమె ఆస్తిపాస్తులు కూడా చేజారిపోవడం జరిగిందట, అదే సమయంలో సదరు డాక్టర్ యొక్క టార్చర్ మరింత ఎక్కువ కావడంతో ఎలాగైనా అతడికి కొంత డబ్బు ఇచ్చి వదిలించుకోవాలని భావిచినప్పటికీ ఆమెకు అప్పట్లో ఆ పరిస్థితి కుదరలేదట. అయితే అదేసమయంలో హఠాత్తుగా ఒకరోజు చెన్నై లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకుంది స్మిత. ఇక ఆ ఘటన సమయంలో ఆమె రాసిన సూసైడ్ నోట్ కూడా అందరినీ కలిసి వేసింది. కొన్నేళ్ల క్రితం నన్ను కోరుకున్న వ్యక్తి, ఇప్పుడు నా దగ్గర ఏమీ లేకపోవడంతో నన్ను కాదంటున్నాడు, అంతేకాక అతడి టార్చర్ నేను భరించలేకపోతున్నా అంటూ ఆమె రాసిన ఆ లెటర్ ఎప్పటికీ మరిచిపోలేదని ఆమె గురించి బాగా తెలిసిన సీనియర్ జర్నలిస్టులు ఇప్పటికీ చెప్తూ ఉంటారు. అది మాత్రమే కాక, సిల్క్ స్మితది ఆత్మహత్య కాదు హత్యే అనే వాదన తెరమీదకు వచ్చినప్పటికీ, అప్పట్లో తమిళనాడు ప్రభుత్వం ఆమె ఘటనను సీరియస్ గా తీసుకోలేదని విమర్శలు కూడా ఆ సమయంలో వెల్లువెత్తాయి.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: