కన్నడ భామ రష్మిక మందన్న ఏ ముహుర్తాన టాలీవుడ్ లో అడుగు పెట్టిందో కాని ఛలో అంటూ వచ్చి సూపర్ హిట్ కొట్టి ఆ తర్వాత గీతా గోవిందంతో స్టార్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత దేవదాస్, డియర్ కామ్రేడ్ పెద్దగా వర్క్ అవుట్ కాకున్నా ఈ పాపులారిటీతో సూపర్ స్టార్ మహేష్ తో ఛాన్స్ పట్టేసింది. మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాలో అదరగొట్టిన అమ్మడు ఆ సినిమాతో మరింత క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా తర్వాత వరుస స్టార్ అవకాశాలు అందుకుంటుంది రష్మిక. 

 

ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న సినిమాలో ఛాన్స్ పట్టేసిన ఈ కన్నడ భామ నితిన్ భీష్మలో కూడా నటిస్తుంది. నితిన్, రష్మిక పోస్టర్స్ తోనే ఈ జోడీ సూపర్ అనిపించుకుంటుంది. నితిన్ కు పర్ఫెక్ట్ పెయిర్ గా రష్మిక ఇంప్రెస్ చేస్తుంది. ఇక భీష్మ సినిమా నుండి వస్తున్న సాంగ్స్ లో రష్మిక తన అసలు టాలెంట్ చూపించేస్తుది. భీష్మ సినిమా నుండి వచ్చిన వాటే బ్యూటీ సాంగ్ రీసెంట్ గా రిలీజైంది. ఈ సాంగ్ లో రష్మిక గ్లామర్ లుక్ తో పాటుగా డ్యాన్స్ మూమెంట్స్ అదరగొట్టాయి.

 

ఇంతకుముందు చేసిన నాలుగైదు సినిమాల్లో తన నటనతో ఇంప్రెస్ చేసిన ఈ అమ్మడు కొత్త సినిమాల్లో కొత్తగా డ్యాన్స్ మూమెంట్స్ తో కూడా దుమ్ముదులిపేస్తుంది. డ్యాన్స్ అంటే తనకు ఇష్టమని కాని దాన్ని ఎవరు గుర్తించట్లేదని అన్నది రష్మిక సరిలేరు నీకెవ్వరు మైండ్ బ్లాంక్, హి ఈజ్ సో క్యూట్ సాంగ్స్ తో కొద్దిగా రుచి చూపించిన రష్మిక భీష్మలో వాటే బ్యూటీ సాంగ్ లో ఓ ఫ్లోర్ మూమెంట్ తో సర్ ప్రైజ్ చేసింది. ఈమధ్య డ్యాన్సుల్లో సాయి పల్లవిని సూపర్ అనేవారు ఇప్పుడు రష్మిక ఆమెకు కూడా షాక్ ఇచ్చేలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: