ఒక సినిమాకు సంబంధించి ఒక సక్సస్ మీట్ జరుపుకోవడం ఒక సాంప్రదాయం. అయితే ‘అల వైకుంఠపురములో’ మూవీ సూపర్ సక్సస్ సాధించి ఇండస్ట్రీ హిట్ గా మారిపోవడంతో అల్లు అర్జున్ ఏదో ఒక అవకాశం కల్పించుకుని మీడియా ముందుకు వస్తూ ‘అల’ రికార్డులను హైలెట్ చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులలో బన్నీ లేటెస్ట్ గా తన తోటి హీరోలకు విసిరిన స్వీట్ ఛాలెంజ్ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 

‘అల వైకుంఠ పురములో’ రికార్డులు చాల త్వరగా బ్రేక్ అవ్వాలని కోరుకుంటున్నానని మరో టాప్ హీరో సినిమా ‘అల’ స్థాయికి మించి ఘన విజయం సాధిస్తే చూడాలని ఉంది అంటూ కామెంట్ చేసాడు. అంతేకాదు ‘అల’ కలక్షన్ రికార్డులు బ్రేక్ అయితే తనకు కూడ మరింత కసి పెరిగి మరింత కష్టపడి మరో మంచి సినిమాలో నటించి మెప్పించే ఆస్కారం ఉంటుంది అంటూ బన్నీ వ్యూహాత్మకంగా కామెంట్ చేసాడు. 

వాస్తవానికి బన్నీ కామెంట్స్ పైకి వినయంగా కనిపిస్తున్నా లోలోపల అతడి ఇగో ను సూచిస్తున్నాయి అంటూ ఈ కామెంట్స్ పై విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి ఒక సినిమా ఇండస్ట్రీ రికార్డ్ అంటూ ప్రచారం జరిగిన తరువాత ఆ స్థాయి విజయం అందుకునే సినిమా రావడానికి కనీసం ఒక సంవత్సరం పైన పడుతుంది. ‘రంగస్థలం’ తరువాత రియల్ హిట్ ‘అల వైకుంఠపురములో’ అన్న ప్రచారం జరుగుతున్న పరిస్థితులలో ‘అల మ్యానియా మరికొన్ని నెలలు కొనసాగే ఆస్కారం ఉంది.

నిన్న విడుదలైన ‘అశ్వద్దామ’ మూవీకి ఎవరేజ్ టాక్ వచ్చిన పరిస్థుతులలో ఈ వీకెండ్ కూడ ‘అల వైకుంఠపురములో’ మ్యానియా కొనసాగే ఆస్కారం కనిపిస్తోంది. ఇప్పటి వరకు టివి సీరియల్స్ చూస్తూ కాలం గడుపుతున్న చాలామంది మహిళా ప్రేక్షకులు కూడ ‘అల’ ధియేటర్ల వైపు వస్తున్న పరిస్థితులలో ఈ మూవీ కలక్షన్స్ విషయంలో మరికొన్ని రికార్డులు క్రియేట్ అయినా ఆశ్చర్య పడనక్కరలేదు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: