హనీ ఇస్ ద బెస్ట్ లాంటి అనేకమైన ఆకట్టుకునే క్యారెక్టర్లను సూపర్ గా పోషించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మెహ్రీన్ ఏర్పరచుకుంది. మొన్నీమధ్య సంక్రాంతికి విడుదలైన 'ఎంత మంచివాడవురా!' చిత్రంతో పాటు నిన్న రిలీజ్ అయిన అశ్వథ్థామ లో కూడా కథానాయకిగా నటించింది. కానీ ఈ రెండు చిత్రాలలోనూ తన పాత్రకి సరైన గుర్తింపు లభించలేదు. అలాగే గతంలో మంచి పాత్రలు పోషించినప్పటికీ ఆమెకు క్రెడిట్ మాత్రం దక్కలేదు. ఈ విధంగా తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో నటించినప్పటికీ... ఆమెకు మాత్రం కావాల్సినంత గుర్తింపు రావడం లేదు.

 

ఎంత మంచి వాడవురా సినిమాని పక్కన పెడితే... నిన్న రిలీజైన అశ్వథ్థామ చిత్రంలో ఆమెకు హీరోయిన్ పాత్ర ఇచ్చినా.. సినిమాలో ఆమెకు సంబంధించిన సన్నివేశాలు చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో మెహ్రీన్ అభిమానులంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. అసలు ప్రాముఖ్యత లేని పాత్రకు మెహ్రీన్ ఒప్పుకొని చాలా పెద్ద తప్పు చేసిందని తెలుగు ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు.


దీంతో మెహ్రీన్ సినిమాలన్నీ అంతగా విజయం సాధించకపోవడంతో ఆమెకు తెలుగులో ఆఫర్స్ సన్నగిల్లి పోయే అవకాశం ఉంది. అది కూడా హీరోయిన్ గా అవకాశం మళ్ళీ రావాలంటే ఒక మిరాకిల్ జరగాలంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా వరుస డిజాస్టర్ సినిమాలతో తెలుగు ఇండస్ట్రీ నుండి మూటాముల్లె సర్దుకుని మెహ్రీన్ వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉందని తెలుస్తోంది.

 

అయితే తెలుగు ఇండస్ట్రీ నుండి వెళ్ళిపోయి.. తమిళ ఇండస్ట్రీలో సినిమాలు చేయడానికి అంగీకరిస్తే తన సినీ కెరీర్ చాలా బాగుంటుంది అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఈమెకు తమిళ ఇండస్ట్రీలో పాపులారిటీ బాగానే ఉంది. అదేవిధంగా స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు కూడా వస్తున్నాయి. సో, ఆమె తమిళ ఇండస్ట్రీకి మకాం మారిస్తే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటుందని ఎక్కువమందే అనుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: