టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఓ ప్ర‌త్యేక‌మైన‌ క్రేజ్ ఉంద‌న‌డంలో ఏ మాత్రం సందేహం లేదు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన దాదాపు అరడజను మంది హీరోలు ఇండస్ట్రీలో సందడి చేస్తున్నారు. ఫ్యూచర్ లో ఈ నంబర్ పెరిగే ఛాన్స్ కూడా ఉంది. కానీ ఈ స్టార్ ఫ్యామిలీ నుంచి ఒక్క హీరోయిన్ కూడా ఇంట్రడ్యూస్ కాలేదు. కానీ ఆ ధైర్యం చేసింది నిహారిక. గ్లామర్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడం కోసం టాలీవుడ్ అడుగు పెట్టిన నిహారిక కాస్తో కూస్తో ఆక‌ట్టుకుంది. ఇక ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్‌ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

 

ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ మరో హీరోగా నటిస్తున్నాడు. ఈ ఇద్దరిపై వచ్చే సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు జక్కన్న. అయితే ఈ సినిమా త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ ఏ ద‌ర్శ‌కుడితో ఫిక్స్ అవుతాడా అని ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌లు కొన‌సాగుతున్నాయి. ఎన్టీఆర్ ఇప్పటికే త్రివిక్రమ్‌ను లైన్‌లో పెట్టేసాడు. దీంతో రామ్ చరణ్ కూడా ఇప్పుడే తర్వాతి సినిమాను సెట్ చేసుకుంటున్నాడ‌ట‌. అయితే ఇక్క‌డ విష‌యం ఏంటంటే.. ఇక చ‌ర‌ణ్ సినిమాల విష‌యంలో అర‌వింద్ ఇన్వాల్‌మెంట్ ఏ మాత్రం లేకుండా మొత్తం చిరుయే చూసుకుంటున్నాడు. 

 

నిన్న‌టి వ‌ర‌కు చిరు క‌థ‌లు వినేంత తీరిక ఉండేది కాదు. అయితే  ఇప్పుడు క‌థ‌లు, డైరెక్ట‌ర్ల ఎంపిక‌, మార్పులు, చివ‌ర‌కు రిలీజ్‌, ప్ర‌మోష‌న్లో కూడా చిరుయే చూసుకోవాల‌ని డిసైడ్ అయిన‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే చిరంజీవి అర‌వింద్ ఇన్వాల్‌మెంట్‌ను పూర్తిగా త‌ప్పించిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ కోసం చిరంజీవి అనిల్ రావిపూడితో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్టు స‌మాచారం. ఇటీవ‌ల సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన స‌రిలేరు నీకెవ్వ‌రూ సూప‌ర్ డూప‌ర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే చిరూ మంచి ఫామ్‌లో ఉన్న అనిల్‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: