అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన అల వైకుంఠపురములో చిత్రం బాక్సాఫీసు వద దుమ్ము దులిపింది. దాదాపు సంవత్సరంన్నర గ్యాప్ తర్వాత వచ్చిన ఈ సినిమా అల్లు అర్జున్ అభిమానులకి ఐ ఫీస్ట్ అయింది. ఫైట్లు, డాన్సులు, డైలాగులతో బన్నీ అభిమానులకి ఆనందాన్ని పంచాడు. సంక్రాంతి రేసులో పరుగు ప్రారంభించిన ఈ సినిమా ఇంకా పరుగు పెడుతూనే ఉంది. అప్పటి వరకు తన వెనక వచ్చేవారు ఆగిపోయినా ఎక్కడా ఆగకుండా వెళ్తూనే ఉంది.

 

 

సినిమా విడుదలయి చాలా రోజులు కావొస్తున్నా వసూళ్ళలో ఎక్కడా తగ్గట్లేదు. కళ్ళు చెదిరే కలెక్షన్లతో నాను బాహుబలి రికార్డును సొంతం చేసుకుంది. ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా చెప్పుకుంటున్న ఈ చిత్ర సక్సెస్ సంబరాలు బాగా జోరుగా జరుగుతున్నాయి. ఈ సంబరాల్లో అల్లు అర్జున్ మాట్లాడుతూ చాలా ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు. బాహుబలి సినిమాని పక్కన పెడితే ప్రస్తుతానికి ఇండస్ట్రీ హిట్ గా పేరు తెచ్చుకుంది.

 

 

ఇండస్ట్రీ హిట్ గురించి ఎవరికి తోచింది వారు మాట్లాడుకుంటున్నారు.  ఆ మాటలన్ని పక్కన పెడితే అల వైకుంఠపురములో సాధించిన ఈ ఫీట్ ని మరో హీరో సినిమా బద్దలు కొడితే తాను హ్యాప్పీగా ఫీల్ అవుతానని అంటున్నాడు. ఇండస్ట్రీ హిట్ ఎప్పుడూ పర్మినెంట్ గా ఉండకూడదు. ఒకరు సాధించినదాని కన్నా మరొకరు ఎక్కువ సాధిస్తేనే ఇండస్ట్రీ బాగుంటుందని అంటున్నాడు. అందుకే అల వైకుంఠపురములో రికార్డు ఎంత తొందరగా బద్దలవుతే అంతా బాగుంటుందట.

 

 

ఈ మాటలు విన్న ఎవరికైనా బన్నీ నిజంగా చాలా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తున్నాడని అనిపిస్తుంది. మరి బన్నీ అన్నట్టు  అల వైకుంఠపురములో రికార్డుని ఏ హీరో సినిమా బద్దలు కొడుతుందో చూడాలి. ప్రస్తుతం అల వైకుంఠపురములో సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్ మరికొద్ది సుకుమార్ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: