ర‌ష్మిక మండ‌న్న ఈ పేరు విన‌గానే అంద‌రికి ముందు గుర్తు వ‌చ్చేది గీత‌గోవిందం చిత్రం. ఆ చిత్రంతో ఈ భామ తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో నిలిచిపోయింది. అందులో ఎంతో అద్భుత‌మైన న‌ట‌న‌ను క‌న‌బ‌రిచింది. ఇక అక్క‌డి నుంచి వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతూ టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది ఈ భామ‌. దాంతో అన్నీ పెద్ద హీరోల స‌ర‌స‌న వ‌రుస అవ‌కాశాల‌తో దూసుకుపోతుంది. ఇటీవ‌లె మ‌హేష్ స‌రిలేరునీకెవ్వ‌రు చిత్రంతో హిట్ కొట్టింది ఈ భామ‌. ప్ర‌స్తుతం ఈ భామ అల్లుఅర్జున్ మ‌రియు ఎన్టీఆర్‌ల చిత్రాల్లో కూడా హీరోయిన్‌గా సెలెక్ట్ అయింది. ఇప్ప‌టి వ‌ర‌కు ర‌ష్మిక పెద్ద‌గా గ్ల‌మ‌ర్ వ‌ల‌క‌బోసే పాత్ర‌ల్లో న‌టించ‌లేదు. కానీ ఇప్పుడు నితిన స‌ర‌స‌న న‌టించ‌బోయే భీష్మ చిత్రంలో ఆమె గ్ల‌మర్‌తో అంద‌రినీ రెచ్చ‌గొట్ట‌బోతుంది.

 

ప్ర‌తిరోజు భీష్మ్ చిత్ర యూనిట్ ఏదో ఒక పోస్ట్‌ర్‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రిస్తున్నారు. ఇక ప్ర‌స్తుతం విడుద‌ల చేసిన పోస్ట‌ర్‌లో నితిన్ ని ర‌ష్మిక ప‌ట్టుకున్న ఫోజు చూసి అంద‌రూ ఆమెకు ఫిదా అయిపోతున్నారు. అంతేకాక ఈ చిత్రంలో వీరిద్ద‌రి రొమాన్స్ పీక్స్‌లో ఉండ‌బోతుంద‌ని తెలుస్తుంది. మ‌రి చీర‌క‌ట్టుకుని నితిన్ ని ప‌ట్టుకున్న స్టైల్‌లో ఆమె న‌డుఒంపుల‌తో కుర్రాళ్ల‌కు మ‌త్తెక్కిస్తోంది ఈ భ‌మ‌. ఇక టోట‌ల్‌గా ఈ చిత్రంలో ర‌ష్మిక నితిన్‌తో క‌లిసి ఒక ల‌వ్ అండ్ రొమాంటిక్ యాంగిల్‌లో క‌నిపించ‌బోతుంద‌ని పోస్ట‌ర్స్‌, సాంగ్స్ చూస్తుంటే అర్ధ‌మ‌వుతుంది. 

 

ర‌ష్మిక‌మండ‌న్న‌, నితిన్  ఇక వీరిద్ద‌రి కాంబినేష‌న్లో రాబోతున్న మొద‌టి చిత్రం ఇది. ఈ చిత్రం  అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఫిబ్రవరి 21న ‘భీష్మ’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావ‌డానికి చిత్ర నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. ‘లై’, ‘ఛల్ మోహనరంగ’, ‘శ్రీనివాస కళ్యాణం’ వంటి వరుస పరాజయాల తర్వాత చేస్తున్న ‘భీష్మ’ మూవీపైనే నితిన్ ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రానికి సంగీతం : మహతి స్వర సాగర్, కెమెరా : సాయి శ్రీరామ్, ఎడిటింగ్ : నవీన్ నూలి, ఆర్ట్ : సాహి సురేష్.

మరింత సమాచారం తెలుసుకోండి: