నటనకు ఆస్కారం ఉన్న పాత్రలనే చేయాలనుకుంటున్నానని చెప్పారు వరల్డ్ ఫేమస్ లవర్ హీరోయిన్ ఐశ్వర్వా రాజేష్. క్రాంతిమాధవ్‌ దర్శకత్వంలో కేయస్ రామారావు నిర్మించిన చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్ లో హీరోగా విజయ్ దేవరకొండ, హీరోయిన్లుగా రాశీఖన్నా, కేథరీన్, ఇజబెల్లాతో పాటు ఐశ్వర్యా రాజేశ్ కూడా నటించారు. ఈ చిత్రం ఇటీవల విడుదల కావడంతో చిత్ర విశేషాలను ఆమె మీడియాకు వెల్లడించారు. 

 

2018లో హైదరాబాద్ కు వచ్చినప్పుడు క్రాంతిమాధవ్ గారు ఈ సినిమా కథ చెప్పారు. నటనకు ఆస్కారం ఉన్న కథ కావడంతో నాకు బాగా నచ్చింది. గత పదేళ్లలో సువర్ణ లాంటి పాత్రను ప్రేక్షకులు చూసి ఉండరు. ఈ సినిమాలో నాతో పాటు మరో ముగ్గురు హీరోయిన్లు ఉన్నా ఏవరి ప్రాధాన్యం వాళ్లకు ఉంటుంది. నటించారు. కానీ కథ రీత్యా ఎవరి ప్రాముఖ్యత వారికి ఉంటుంది.

 

కథ డిమాండ్‌ చేస్తే సినిమాలో లిప్‌లాక్‌ సన్నివేశాలు తప్పవు. నేను నటించిన ‘వడచెన్నై’ చిత్రంలో నాలుగు లిప్‌లాక్‌ సీన్లు ఉన్నాయి. ఈ తరంలో దాదాపు అందరూ ఓపెన్ గానే ఉంటున్నారు. ప్రస్తుతం బయోపిక్ ట్రెండ్‌ నడుస్తోంది. జయలలితగారి బయోపిక్‌లో నటించాలనుకున్నాను. నా ఫేవరెట్‌ హీరోయిన్ సౌందర్య గారి బయోపిక్‌లో కూడా నటించాలని ఉంది. కాకపోతే కాస్త నా కలర్‌ తక్కువగా ఉంటుందేమో అని నవ్వేశారు. తమిళంలో ఇప్పటికే ‘వానమ్‌ కొట్టటుమ్‌’ సినిమాలో నటించాను. విజయ్‌ సేతుపతిగారితో కూడా ఓ సినిమా చేస్తున్నాను. తెలుగులో నాని నటిస్తున్న ‘టక్‌ జగదీష్‌’లో కీలక పాత్ర చేస్తున్నాను.

 

మరోవైపు ఆమె పర్సనల్ విషయాలను కూడా మీడియాతో షేర్ చేసుకున్నారు. నా చిన్నప్పుడే మా నాన్నగారు (రాజేష్‌) మరణించారు. 2014లో ‘కాక్కముట్టై’ సినిమాకు ముందు నా పేరు స్క్రీన్ పై ఐశ్వర్య అని ఉండేది. ఆ తర్వాత ఐశ్వర్యా అయ్యర్, ఐశ్వర్యా లక్ష్మి ఇలా కొందరు ఐశ్వర్య అనే పేరుతో ఇండస్ట్రీకి వచ్చారు. అప్పుడు నా పేరు మార్చుకోవాలనుకున్నాను. ‘కాకముట్టై’తో నా పేరును ఐశ్వర్యా రాజేష్‌గా మార్చుకున్నాను. దీంతో మా నాన్న నాతోనే ఉన్నారనే ఫీలింగ్‌ కలిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: