2018 లో తమిళంలో వచ్చిన 96 మూవీ ఒక క్లాసిక్ గా నిలిచిపోయింది. త్రిష, విజయ్ సేతుపతి జంటగా నటించిన ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ గా నిల్చి ప్రేక్షకుల మనసులో శాశ్వతంగా నిలిచిపోయింది. అయితే ఈ సినిమా ఇప్పుడు తెలుగులో రీమేక్ అయింది. సమంత హిరోయిన్ గా శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం "జాను" అనే పేరుతో తెరకెక్కింది. ఇటీవల రిలీజైన ఈ చిత్ర ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది.

 

 

సినిమా ఫిబ్రవరి 7 వ తేదీన విడుదల అవుతుందని ప్రకటించారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఎక్కువ ప్రమోషన్లు చేయకపొవడం ఆశ్చర్యంగా ఉంది. సినిమా విడుదల కొన్ని రోజులే ఉన్నా కూడా ప్రమోషన్ల హడావిడి కనిపించడం లేదు. అదీ కాకుండా ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ లో సమంత,  శర్వానంద్ లు మాట్లాడుతూ, తమకి ఈ సినిమా రీమేక్ చేయడం ఇష్టం లేదన్నట్లుగా మాట్లాడారు.

 

 

కేవలం దిల్ రాజు బలవంతం మీదనే ఈ సినిమా చేశారని ఒప్పుకున్నారు. క్లాసిక్ ని రీమేక్ చేస్తే ఉండే కష్టాలు అందరికీ తెలుసు. ప్రతీ దానిలో ఒరిజినల్ దానితో పోల్చి చూస్తారు. ఈ విషయం తెలుసు కాబట్టే సమంత, శర్వాలు అలా అని ఉంటారు. అందువల్లే సినిమాకి ఎక్కువ ప్రమోషన్ చేయట్లేదా అని అనుమానం కలుగుతుంది. రీమేక్ అనే కాదు ఈ సినిమాకి కలిసి రాని మరొక అంశం కూడా ఉంది.

 

అదే సీజన్. అవును.. సంక్రాంతి సీజన్ పూర్తయింది. ఈ ఫిబ్రవరి నెల నుండి మార్చ్ వరకు పిల్లలకి ఎగ్జామ్స్ అని ఫ్యామిలీస్ అన్నీ బిజీగా ఉంటాయి. ఎవరూ సినిమాలు చూడడానికి ఆసక్తి చూపరు. ఆ విధంగా థియేటర్ కి వచ్చే ప్రేక్షకులు తగ్గిపోతారు. సినిమా బాగున్నా కూడా థియేటర్ కి వచ్చే ప్రేక్షకులు తక్కువ కాబట్టి ఎక్కువ బిజినెస్ అవదు. జాను సినిమాకి బడ్జెట్ తక్కువే పెట్టి ఉంటారు కాబట్టి సినిమా బాగుండి ఒరిజినల్ ఫిల్మ్ ఇంపాక్ట్ పడకపోతే సేఫ్ అయిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: