మాస్ మహారాజా రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘డిస్కోరాజా’.ఈ చిత్రం జనవరి 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం కాస్త ఓపెనింగ్స్ పర్వాలేదు కానీ కలెక్షన్స్ మాత్రం అస్సలు లేవనే చెప్పాలి. కొత్త సైన్స్ ఫిక్షన్ నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నభానషేష్, పాయల్రాజపుత్, తానియా, బాబిసింహా, సునీల్ తదితరులు నటించారు. రామ్‌తాళ్ళూరి నిర్మించారు.
ఇక ఈ చిత్రం రవితేజ్ కెరియర్లో మరో ఫ్లాప్ వచ్చి చేరినట్లే. కరెక్ట్‌గా వారినికే ఈ చిత్రం దుకాణం ముసేసిందనే చెప్పాలి. వీఐ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు ఎందుకో సరిగా కనెక్ట్ కాలేదు. ఫలితంగా విడుదలైన రెండో రోజు నుంచే థియేటర్లలో జనాలు లేరనే చెప్పాలి. మరి ఇలాంటి పరిస్థితుల్లో...
వరల్డ్ వైడ్ ఈ సినిమాకు 7 రోజుల్లో కేవలం 7 కోట్ల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. ఒకరకంగా చెప్పాలంటే ఇది చాలా దారుణమైన కలెక్షన్లు. ఇక ఈ చిత్రం చాలా హై బడ్జెట్‌తో తెరకెక్కింది. కాకపోతే బడ్జెట్ ఎంతన్న విషయం చిత్ర యూనిట్ గోప్యంగా ఉంచింది కానీ చాలా హై బడ్జెట్‌తో తెరకెక్కినప్పటికీ చాలా లాస్ అయినట్లు స్పష్టంగా తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వారం రోజుల్లో 6 కోట్ల 38 లక్షల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. ఏపీ, నైజాంలో ఈ సినిమాను కాస్త అటుఇటుగా 15 కోట్ల రూపాయలకు అమ్మారు. సో.. బయ్యర్లందరికీ సగానికి పైగా నష్టాలు మూటగట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో డిస్కోరాజాకు
వారం రోజుల్లో వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి.
నైజాం – రూ. 2.70 కోట్లు
సీడెడ్ – 90 లక్షలు
ఉత్తరాంధ్ర – 89 లక్షలు
ఈస్ట్ – 48 లక్షలు
వెస్ట్ – 38 లక్షలు
గుంటూరు – 40 లక్షలు
నెల్లూరు – 25 లక్షలు
కృష్ణా – 38 లక్షలు
ఇంత తక్కువ కలెక్షన్లు వచ్చిన చిత్రం ఈ మధ్య కాలంలో విడుదలైన వాటిల్లో బహుశా ఇదేననుకుంట. మరి ఈ చిత్రం ఇంత ఫ్లాప్ అవ్వడానికి ప్రధాన కారణం. సెలవులు అయిపోయి అందరూ వారి వారి విధుల్లో బిజీగా ఉండడం వల్ల కలెక్షన్లు తక్కువయ్యాయా లేక కథ చాలా మందికి కనెక్ట్ కాలేదా అంటే... రెండు విషయాలు కూడా ప్రధానమైనవే అని తెలుస్తుంది.