మాస్ మహారాజా రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘డిస్కోరాజా’.ఈ చిత్రం జ‌న‌వ‌రి 24న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.  ఈ చిత్రం కాస్త ఓపెనింగ్స్ ప‌ర్వాలేదు కానీ క‌లెక్ష‌న్స్ మాత్రం అస్స‌లు లేవ‌నే చెప్పాలి. కొత్త సైన్స్ ఫిక్షన్ నేప‌ధ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో న‌భాన‌షేష్‌, పాయ‌ల్‌రాజ‌పుత్‌, తానియా, బాబిసింహా, సునీల్ త‌దిత‌రులు నటించారు. రామ్‌తాళ్ళూరి నిర్మించారు.

 

ఇక ఈ చిత్రం ర‌వితేజ్ కెరియ‌ర్‌లో మ‌రో ఫ్లాప్ వ‌చ్చి చేరిన‌ట్లే. క‌రెక్ట్‌గా వారినికే ఈ చిత్రం దుకాణం ముసేసింద‌నే చెప్పాలి. వీఐ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు ఎందుకో స‌రిగా కనెక్ట్ కాలేదు. ఫలితంగా విడుదలైన రెండో రోజు నుంచే థియేటర్లలో జ‌నాలు లేర‌నే చెప్పాలి. మ‌రి ఇలాంటి ప‌రిస్థితుల్లో...

 

వరల్డ్ వైడ్ ఈ సినిమాకు 7 రోజుల్లో కేవలం 7 కోట్ల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. ఒక‌ర‌కంగా చెప్పాలంటే ఇది చాలా దారుణ‌మైన క‌లెక్ష‌న్లు. ఇక ఈ చిత్రం చాలా హై బ‌డ్జెట్‌తో తెర‌కెక్కింది. కాక‌పోతే బ‌డ్జెట్ ఎంత‌న్న విష‌యం చిత్ర యూనిట్ గోప్యంగా ఉంచింది కానీ చాలా హై బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన‌ప్ప‌టికీ చాలా లాస్ అయిన‌ట్లు స్ప‌ష్టంగా తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వారం రోజుల్లో 6 కోట్ల 38 లక్షల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. ఏపీ, నైజాంలో ఈ సినిమాను కాస్త అటుఇటుగా 15 కోట్ల రూపాయలకు అమ్మారు. సో.. బయ్యర్లందరికీ సగానికి పైగా నష్టాలు మూట‌గ‌ట్టుకోవ‌ల‌సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. తెలుగు రాష్ట్రాల్లో డిస్కోరాజాకు
వారం రోజుల్లో వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి.

నైజాం – రూ. 2.70 కోట్లు
సీడెడ్ – 90 లక్షలు
ఉత్తరాంధ్ర – 89 లక్షలు
ఈస్ట్ – 48 లక్షలు
వెస్ట్ – 38 లక్షలు
గుంటూరు – 40 లక్షలు
నెల్లూరు – 25 లక్షలు
కృష్ణా – 38 లక్షలు

 

ఇంత త‌క్కువ క‌లెక్ష‌న్లు వ‌చ్చిన చిత్రం ఈ మ‌ధ్య కాలంలో విడుద‌లైన వాటిల్లో బ‌హుశా ఇదేన‌నుకుంట‌. మ‌రి ఈ చిత్రం ఇంత ఫ్లాప్ అవ్వ‌డానికి ప్ర‌ధాన కార‌ణం. సెల‌వులు అయిపోయి అంద‌రూ వారి వారి విధుల్లో బిజీగా ఉండ‌డం వ‌ల్ల క‌లెక్ష‌న్లు త‌క్కువ‌య్యాయా లేక క‌థ చాలా మందికి క‌నెక్ట్ కాలేదా అంటే... రెండు విష‌యాలు కూడా ప్ర‌ధాన‌మైన‌వే అని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: