నవ్వడం ఒక యోగం.. నవ్వక పోవడం ఒక రోగం... ఆనందంగా నవ్వుకుంటే ఆరోగ్యంగా ఉంటారంటారు.  ఆ ఆనందాన్ని నవ్వుల్ని పంచే కమెడియన్లు తెలుగు తెరపై ఎంతో మంది ఉన్నారు. రేలంగి, రాజబాబు, పద్మనాభం, చలం ల తర్వాత ఆ తరహా కామెడీ పంచుతూ తనదైన ముద్ర వేసుకున్న నటులు బ్రహ్మానందం.  తెరపై బ్రహ్మానందం కనిపిస్తే చాలు.. టక్కున నవ్వు వస్తుంది. ఆ రేంజ్ లో తన కళ్లతో.. హావభావాలతోనే నవ్విస్తాడు. హాస్యానికి చిరునామా ఎవరని అడిగితే టక్కున చెప్పెయ్యవచ్చు ఆయన పేరు. కామెడీ కింగ్, హాస్య బ్రహ్మా,నవ్వుల రారాజు ఇలాంటి ఎన్నో బిరుదులు ఆయన సొంతం. అందుకే  ఆయనకు పద్మశ్రీ అవార్డు వరించింది.  వందల సినిమాల్లో నవ్వులు పూయించిన బ్రహ్మానందం పుట్టిన రోజు నేడు. బ్రహ్మానందం కన్నెగంటి ఫిబ్రవరి 1 1956 లో సత్తెనపల్లి, ఆంధ్రప్రదేశ్ లో జన్మించారు. కన్నెగంటి బ్రహ్మానందం  పలు భాషలలో వెయ్యికి పైగా సినిమాలలో నటించి 2010 లో గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కాడు. 

 

ఉత్తమ హాస్య నటుడిగా ఐదు నంది పురస్కారాలు, ఒక ఫిల్మ్ ఫేర్ పురస్కారం, ఆరు సినీ మా అవార్డులు, మూడు సైమా పురస్కారాలు అందుకున్నాడు.  2005 లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేటు ప్రధానం చేసింది. బ్రహ్మానందాన్ని మొట్టమొదటి సారిగా మూవీ కెమెరా ముందు మేకప్ వేసి నిలబెట్టినవ్యక్తి దర్శకుడు వేజళ్ల సత్యనారాయణ. నరేశ్ కథానాయకుడిగా నటించిన శ్రీ తాతావతారం అనే మూవీలో కథానాయకుడి నలుగురు స్నేహితులలో ఒకడిగా నటించాడు. విశేషం ఏమిటంటే తన పుట్టినరోజు ఫిబ్రవరి 1 వ తేదీన ఆ సినిమాలో తొలి వేషం వేశాడు. అయితే ఈ మూవీలో పాడె మీద పైసలు ఏరుకొనే వెధవా... పోతావ్‌రా రేయ్... నాశనమై పోతావ్...అనే డైలాగ్.. కోటా శ్రీనివాస రావు.. ఓరేయ్ అరగుండు వెధవ.. అంటూ తిట్టడం.. హైలెట్ గా నిలిచాయి.  

 

మూవీ తర్వాత బ్రహ్మానందం మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. తనదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.దర్శకులు ఆయన కోసమే ప్రత్యేకించి పాత్రను రాసుకునేవారు. పాత్ర ఏదైనా బ్రహ్మనందం అందులో జీవించే వారు అనడంలోఅతిశయోకిత్తి లేదు.నేడు 64వ పడిలోకి అడుగుపెడుతున్న బ్రహ్మానందం ఇలాంటి మరెన్నో పుట్టిన రోజులు జరుపుకుంటూ మరిన్ని సినిమాల్లో నటించి నవ్వించాలని కోరుకుందాం.. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: