సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు న‌టించిన స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రం నిర్మాత అనిల్ సుంక‌ర‌, ద‌ర్శ‌కుడు అనిల్‌రావిపూడి, కృష్ణ‌తో స్పెషల్ ఇంట‌ర్వ్యూ మీకోసం... అనిల్ శుంక‌ర ఈ స‌రిలేరు సినిమాతో ఒక జీవితాశయం నెర‌వేరింది. నేను సినిమాల్లోకి వ‌చ్చిందే మీతో సినిమా తీయాల‌ని అనుకోకుండా మ‌హేష్‌బాబుగారితో తీశాను. ల‌క్కీగా అనిల్ రావిపూడితో ప‌ని చేశాను. మీ సినిమాల్లో ముందుగా గుర్తువ‌చ్చేది అల్లూరిసీతారామ‌రాజు పాత్ర. అనిల్ ద్వారా ఈ సినిమాలో ఆ పాత్ర‌ని క్రియేట్ చేసి అదే పాత్ర‌ని సినిమాలో పెట్టి మీరు కూడా సినిమాలో ఉన్నార‌నే విధంగా చూపించి ఒక బ్ల‌క్ బ‌స్ట‌ర్ కొట్టాం. అల్లూరిసీత‌రామ‌రాజు ఆ పాత్ర‌కి ఉన్న‌ది ఒక స్వాతంత్య్ర‌స‌మ‌ర‌యోధుడు సైనికుడే... సినిమాలో మ‌హేష్ కూడా ఒక సైనికుడే ఆ ట్రావెలింగ్‌లో మేం కొత్త‌గా ఫీల‌యిందేమిటంటే ఆ క్యారెక్ట‌ర్‌ని మీ క్యారెర్ట‌ర్ ద్వారా ఎలివేట్ చెయ్య‌డ‌మ‌నేది స్క్రీన్‌ప్లే అద్భుతంగా కుదిరింది. దానికి ఎండ్ ట్విస్ట్ మీరు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మ‌హేష్ చిన్న‌ప్ప‌టి ముగ్గురు కొడుకులు టైటిల్స్‌లో వేశాం. 

 


అల్లూరి సీతారామ‌రాజు  సీన్ చూసిన‌ప్పుడు మీరు ఎలా ఫీల‌య్యారు?
ఆ పాత్ర క‌రెక్ట్ ప్లేస్ మెంట్‌లో ఈ సినిమాలో క‌రెక్ట్‌గా చూపించారు. అది నాకు తెలిసినంత‌వ‌ర‌కు సినిమాకి బాగా హెల్ప్ అయింది. అక్క‌డి నుంచి సినిమా టేకాఫ్ తీసుకున్న‌ట్ల‌యింది. అక్క‌డి నుంచి కూడా స్టోరీ ఎండింగ్ వ‌ర‌కు నాన్‌స్టాప్‌గా వెళ్ళింది. అందుకే ఈ చిత్రం సూప‌ర్‌హిట్ అయింద‌ని భావిస్తున్నాను. 

 

మీరు మ‌హేష్‌ని అల్లూరిసీతారామ‌రాజు లాగా డైరెక్ట్ చేశారు. ఆ స్టేజ్ మీద ఆయ‌న యాక్ట్ చేసేట‌ప్పుడు మీరు ఎలా ఫీల‌య్యారు?
అంత చిన్న వ‌య‌సులో అలాంటి డైలాగ్స్ చెప్ప‌డం చాలా క‌ష్టం. చాలా క‌రెక్ట్‌గా యాక్ట్ చేశాడు అనిపించింది. పైగా తెలుగు చ‌ద‌వ‌టం కూడా అప్ప‌ట్లో రాదు. ఎవ‌రైనా అసిస్టెంట్ డైరెక్ట‌ర్లు చ‌దివి వినిపిస్తే తెలుసుకునేవాడు. కేవ‌లం ఆ మెమ‌రీతోనే యాక్ట్ చేసేవాడు. 100ప‌ర్సెంట్ ఆ వ‌య‌సులో ఆ పాత్ర‌కి అంత న్యాయం చేయ‌డ‌మ‌నేది నాకు చాలా ఆనందాన్ని క‌లిగించింది. 

 

విజ‌య‌శాంతితో క‌లిసి కొడుకుదిద్దిన కాపురంలో మ‌హేష్ చేశారు. మ‌ళ్ళీ 30ఏళ్ళ త‌ర్వాత వారిద్ద‌రి కాంబినేష‌న్ మీరెలా ఫీల‌య్యారు?
విజ‌య‌శాంతి క్యారెక్ట‌ర్‌కి విజ‌య‌శాంతి యాప్ట్ అని చెప్పాలి. త‌ను మాత్ర‌మే న్యాయం చేయ‌గ‌ల‌దు. ఇక మ‌హేష్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. 100ప‌ర్సెంట్ ఏ క్యారెక్ట‌ర్ ఇచ్చినా బాగానే యాక్ట్ చేస్తాడు. 

 

మీరు మ‌హేష్‌బాబు న‌టించిన వాటిలో ఇంకా మీరు చూడాల‌నుకునే క్యారెక్ట‌ర్స్ ఏమి ఉన్నాయి?
చాలా కాలంగా ఆడియ‌న్స్‌, ఫ్యాన్స్ అడిగేదేంటంటే జేమ్స్ బాండ్ గూఢాచారి లాంటి పాత్ర చేస్తే బావుంటుందని. ఎప్పుడూ కుద‌ర‌లేదు. నేను ఏడు చిత్రాల దాగా న‌టించాను బాండ్ చిత్రాలు. 

 

మైండ్‌బ్లాక్ సాంగ్‌లో మ‌హేష్ డ్యాన్స్ చాలా బావుంటుంది దాని గురించి?
మ‌హేష్ చేసిన సినిమాల‌న్నిటిలోకి ఈ మైండ్‌బ్లాక్ డాన్స్ చాలా చాలా బావుంటుంది. డాన్స్ మాస్ట‌ర్స్ కంపోజింగ్ కూడా అంతే అద్భుతంగా కుదిరింది. 

 

సినిమా మొత్తంలో టోట‌ల్‌గా మీకు న‌చ్చిందేమిటి?
ఫ‌స్ట్ ఆఫ్ రైల్ సీక్వెన్స్ ఎంట‌ర్‌టైనింగ్ గా ఉంది. ఆ త‌ర్వాత నుంచి ఎమోష‌న‌ల్ స్టోరీ ఎక్క‌డా నాన్‌స్టాప్‌గా బోర్ అనేది అనిపించ‌కుండా తీశారు. కొన్ని సినిమాల్లో మ‌ధ్య‌లో ఎక్క‌డైనా బోర్ అనిపిస్తాయి కానీ ఈ చిత్రంలో అలా లేదు. 

 

కొడుకు దిద్దిన కాపురంలో మ‌హేష్‌ని కొట్టే షాట్ ఏదో పెట్టారంట మీరు. విజ‌య‌శాంతిగారు మ‌హేష్‌ని కొట్ట‌లేక‌పోయారంట దాని సీక్వెన్స్ గురించి చెప్పండి?
కొడుకు త‌ప్పు చేసి వ‌స్తాడు. కొడుకుని కొట్టే సీన్ త‌ల్లిగా కొట్టాలి. లేదంటే ఆ సీన్‌ పండ‌దు. అందుకే కొట్టి తీరాల‌ని సీరియ‌స్ అయ్యాం. 

 

మీ డైరెక్ష‌న్‌లో ఎప్పుడైనా ఆయ‌న డైరెక్ట్ చేస్తున్న‌ప్పుడు తిరిగి రీషాట్ చేద్దామ‌న్నారా?
అలాంటిదేమీ లేదు. చిన్న‌ప్పుడే చాలా ఫ్రీగా యాక్ట్ చేసేవాడు. పోరాటంలో నా త‌మ్ముడుగా ఫ‌స్ట్ యాక్ట్ చేశాడు.  చిన్న‌ప్పుడే చాలా ఈజ్ తో యాక్ట్ చేశాడ‌న్న ప్ర‌శంస‌లు వ‌చ్చాయి. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కొడుకుదిద్దిన కాపురం హైలెట్ అయింది. 

 

మ‌హేష్‌గారితో మీరు న‌టించిన చిత్రాల్లో మీకు బెస్ట్ మూమెంట్ ఏది?
కాంబినేష‌న్‌లో బెస్ట్ మూమెంట్ అంటే కొడుకు దిద్దిన కాపుర‌మే. ఎప్పుడూ కూడా నేను ద‌గ్గ‌రుండి ఏదీ యాక్ట్ చేసి చూపించేవాడిని కాదు. అసిస్టెంట్ డైరెక్ట‌ర్లు వెళ్ళి డైలాగ్స్ చెప్పేవారు. త‌నే చేసేవాడు. కొడుకుదిద్దిన కాపురంలో ఒక‌సారి అలాగేమోట‌ర్ బైక్  డ్రైవ్ చేయాలి. అప్పుడు స్టంట్ మాస్ట‌ర్ త్యాగ‌రాజ‌న్‌. బైక్ డ్రైవ్ చేసే విష‌యంలో మ‌హేష్‌కి డూప్ పెట్టాం. అప్పుడు వద్దు నాన్న‌గారు లంచ్‌కి వెళ్ళాక మ‌న‌మే ట్రై చేద్దాం అన్నాడు. నేనే చేస్తా అని పంతం ప‌ట్టి స్టంట్ మాస్టార్‌ని ఒప్పించి త‌నే చేశాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: