విక్టరీ వెంకటేష్ తెలుగు చిత్ర పరిశ్రమ లో ఓ మంచి స్థానాన్ని అందుకున్నాడు. నటన తో, స్టైల్ తో ప్రేక్షకులని ఆకట్టుకుంటాడు. అయితే గతం లో ఎన్నో మంచి సినిమా హిట్లని విక్టరీ వెంకటేష్ అందుకున్నాడు. తెలుగు చిత్ర పరిశ్రమ లో ఆనాటి నుండి ఉన్న సీనియర్ హీరోల లో విక్టరీ వెంకటేష్ ఒకరు.
 
తన దైన నటన తో విభిన్న పాత్రల లో వెంకటేష్ మంచి గెలుపుని తన ఎకౌంట్ లో వేసుకున్నాడు. పాత హీరోయిన్ల తో సైతం ఈ సీనియర్ నటుడు నటించాడు.మీన, జ్యోతిక, ఆర్తి అగర్వాల్ వంటి తారల తో ఎన్నో సినిమాల లో నటించాడు. మంచి కధలనీ, పాత్రలనీ ఎంచుకుంటాడు. ఎన్నో మంచి చిత్రాల లో కూడా ముఖ్య పాత్రలని పోషించాడు నటుడు వెంకటేష్. దృశ్యం, గురు వంటి చిత్రాల లో కూడా వెంకటేష్ తన ప్రతిభ ని చూపించాడు. తాజాగా ఎఫ్-2, వెంకీ మామ హిట్లని హీరో వెంకటేష్ అందుకున్నాడు.
 
వెంకీ మామ లో హీరో అక్కినేని నాగ చైతన్య తో కలిసి మామ పాత్ర ని పోషించాడు. ఇలా తన వయస్సు కి తగ్గ కధలనీ, పాత్రలనీ ఎంచుకుంటూ హిట్లని అందుకున్నాడు.ఇటీవలే నారప్ప అనే చిత్రం లో విక్టరీ వెంకటేష్ నటించనున్నాడు. సినిమా షూటింగ్ కూడా మొదలైంది అని తెలిసిందే. ఈ చిత్రం ఫస్ట్ లుక్ కూడా ప్రేక్షకులని ఎంత గానో మెప్పించింది. తమిళ బ్లాక్ బస్టర్ హిట్ అయిన అసురన్ రిమెక్ ఈ నరప్ప. మొదట ఈ చిత్రానికి ప్రియమణి ని హీరోయిన్ గా తీసుకోవడం జరిగింది అన్న వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఇందులో అమలాపాల్ కూడా నటించనున్నదన్న వార్తలు వినిపిస్తున్నాయి. మణిశర్మ దీనికి మ్యూసిక్ ఇస్తున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ ఆధ్వర్యం లో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: