ఒకప్పుడు సినిమా పోస్టర్ బయటకు వస్తే గాని ఆ సినిమాలో నటి నటుల రూపాలు ఎలా ఉంటాయో తెలిసేవి కావు. కాని ఇప్పుడు అంతా ఫాస్ట్ ఫాస్ట్‌గా తెలిసిపోతున్నాయి. ఇదంతా డిజిటల్ మహిమ..ఒక సినిమా ఇతనితో చేద్దాం అని అనుకోవడం ఆలస్యం క్షణాల్లో ప్రజల్లోకి ఆ వార్త గాలికంటే వేగంగా వ్యాపిస్తుంది. ఇలా ఇప్పటి వరకు సినిమా మొదలవకుండానే విపరీతమైన పబ్లిసిటిని సంపాధించుకున్న సినిమాలు కూడా ఉన్నాయి.

 

 

ఇకపోతే వెంకటేష్ నటిస్తున్న నారప్పా సినిమా విషయానికి వస్తే, ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అయ్యిందో తెలియదు గాని, దాని కధ కధనాలు ఎలా ఉంటాయో తెలియదు గాని, ఈ చిత్రానికి సంబంధిన అప్‌డేట్స్ మాత్రం అధికారికంగా కాకపోయినా, లీకుల పరంగా బయటకు వస్తున్నాయి. తాము చేయబోయే సినిమాకు సంబంధించిన విషయాలను ఎంత గోప్యంగా ఉంచుదామనుకున్న కొన్ని కొన్ని సందర్భాల్లో వీలుపడటం లేదు. ఇలా నారప్పా అనే సినిమా విషయంలో కూడా జరిగింది.

 

 

ఇకపోతే తమిళంలో ధనుష్ నటించిన ’అసురన్’ సినిమాకి రీమేక్ గా  తెలుగులో విక్టరీ వెంకటేష్ ప్రధానపాత్రలో వస్తున్న చిత్రం నారప్పా.. ఇటీవల కాలంలో ఫస్ట్ లుక్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రంలో హీరోయిన్ ప్రియమణిని ఫైనల్ చేశారు.. ఇక ఈ చిత్రంలో వెంకటేష్ తన వయసుకు తగ్గ పాత్రలో కనిపిస్తాడనే టాక్ రాగా,  ఫ్లాష్ బ్యాక్ మోడ్ లో యంగ్ లుక్ లో కూడా కనిపించనున్నాడట.. అయితే ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే యంగ్ వెంకటేష్‌కు జోడిగా,  ‘ఆమె’ సినిమాతో సెమీ న్యూడ్ గా నటించి సెన్సేషన్ క్రియేట్ చేసిన హాట్ బ్యూటీ అమల పాల్ ని ఫైనలైజ్ చేశారట..

 

 

ఇదే కాకుండా అమలపాల్ పాత్ర మలిచిన తీరు ఎంతగానో ఆకట్టుకుంటుందని, ఈమె ఎంట్రీ కీలక టైంలో రావడమే కాకుండా కథని పూర్తిగా మలుపు తిప్పే పాత్ర ఇదని చిత్ర బృందం అంటున్నారట.. అయితే ఈ స్టోరీలో అమలాపాల్ వెంకటేష్‌ల మధ్య ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో మాత్రమే ఈ జంట కనిపిస్తుందని సమాచారం. కాగా ఈ సినిమాకి  శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తుండగా, సురేష్ బాబు – కలైపులి ఎస్ థాను కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు..  

మరింత సమాచారం తెలుసుకోండి: