దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇద్దరూ బడా స్టార్ల కావడం... ఇంకా ఒక చారిత్రాత్మకమైన ఊహాత్మక కథ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతున్నడంతో దీనిపై అంచనాలు ఉండటం అనేది సహజం అని చెప్పుకోవచ్చు. అలాగే అలియా భట్, అజయ్ దేవగన్, ఒలీవియా మోరిస్ లాంటి ఇతర భాషా నటీనటులు ఈ సినిమాకి ఆకర్షణీయంగా మారనున్నారు. అయితే ఇటువంటి సినిమాకి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారంటే అది కంపల్సరిగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నిర్మొహమాటం గా చెప్పుకోవచ్చు. నిజానికి రాజమౌళి సినిమా రిలీజ్ అవుతున్న సమయంలో... ఇతర సినీ నిర్మాతలు గానీ దర్శకులు కానీ తమ సినిమాని రిలీజ్ చేసేందుకు ధైర్యం చేయరు. అయితే ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రం ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారనేది ఎవరికీ తెలియని విషయం. ప్రభాస్, చిరంజీవి ఈ చిత్రం గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నా.. ఇంకా ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం తమ సినిమా రిలీజ్ డేట్ ని గురించి ఖచ్చితంగా చెప్పలేదు.


ఇంతకీ వారికి ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ డేట్ కి సంబంధం ఏంటంటే... చిరంజీవి, ప్రభాస్ నటిస్తున్న రెండు వేరు వేరు చిత్రాలు ఈ సంవత్సరంలో విడుదల కావడానికి సిద్ధమవుతున్నాయి. ఇంకా టైటిల్ ఖరారు కాని కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఆగస్టు నెలలో దసరా పండుగ సందర్భంగా విడుదల చేద్దామని ఆ చిత్ర బృందం అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ విడుదల తేదీ వాయిదా పడడంతో.. అది కూడా దసరా కానుకగా విడుదలవుతుందేమోనని చిరంజీవి చిత్రబృందం తమ సినిమా రిలీజ్ డేట్ ని మార్చుకున్నారు.



అదేవిధంగా ప్రభాస్, krishna KUMAR' target='_blank' title='రాధా కృష్ణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రాధా కృష్ణ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం కూడా దసరా పండుగ సందర్భంగా రిలీజ్ అవుతుందని తొలుత వార్తలు వచ్చాయి. కానీ ఆర్ఆర్ఆర్ సినిమా దసరాకి విడుదల అయితే.. ఆ ప్రభావం ప్రభాస్ సినిమా పై కచ్చితంగా పడుతుంది. దీంతో ముందుగానే ప్రభాస్ తో పాటు చిరంజీవి కూడా ఆర్ఆర్ఆర్ చిత్రం యొక్క రిలీజ్ తేదీపై క్లారిటీ ఇవ్వమని అడుగుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: