తెలుగు యువతకు హుషారు ఎక్కించే యాంకర్ లలో అనసూయ ఒకరు. తన డ్రెస్సింగ్ స్టైల్స్ తో, తన ఒరా చూపుతో యువతను కళ్ళు తిప్పుకోకుండా మాయ చేయడంలో ఈమె దిట్ట. ఎంతో మంది మహిళలు ఈమె డ్రెస్సింగ్ స్టైల్ ను కాపీ కూడా కొడుతుంటారు.

 

సోషల్ మీడియా లో యాక్టీవ్ గా వుండే అనసూయ రీసెంట్ గా తాను చేస్తున్న లోకల్ గ్యాంగ్స్ ఎపిసోడ్ సందర్భంలో దిగిన ఫోటోలను, తన సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. ఇవి ఇప్పుడు వైరల్ అయ్యాయి. అంత అందాన్ని ఎలా పుట్టించావు దేవుడా అనే కామెంట్లే ఎక్కువగా వినిపిస్తున్నారు నెటిజన్లు.

 

తాను పోస్ట్ చేసిన ఫోటో తో పాటు కొన్ని కామెంట్స్ చేసింది. నేను ఎలాంటి మహిళనంటే.. నన్ను చూసి ఇతర మహిళలు స్టైల్‌గా ఎలా ఉండాలో నేర్చుకుంటున్నారు. అలాంటప్పుడు నాకు పోటీనా? అసలు పోటీ అంటే ఏంటి?’’ అని చెప్పింది. ఎప్పుడు ఈ ఫోటో పాటు తన కామెంట్స్ కూడా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

 

ఏది ఏమైనా మన రంగమత్త షోస్, ఈవెంట్స్ తో పాటుగా సినిమాలో కూడా నటిస్తూ బిజీ బిజీ గా గడిపేస్తోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలో బన్నీకి విలన్ పాత్రలో నటించనుందట. ఈమెకు ఈ విలన్ పాత్రలు చేయడం కొత్తేమి కాదు, గతం లో అడవి శేష్ నటించిన క్షణం సినిమాలో, తన విలనిజం సత్తా ఏమిటో చూపించేసింది. బహుశా ఈ సినిమా చూసే సుకుమార్ తన తదుపరి సినిమా లో అనసూయ కు విలనిజం క్యారెక్టర్ ఇచ్చినట్టున్నాడు. అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో రాబోతున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి రానుంది. ఈ సినిమాను దిగ్గజ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించబోతున్నారు 

  

మరింత సమాచారం తెలుసుకోండి: