మెగాస్టార్-కొరటాల శివ కాంబినేషన్లో చిరంజీవి-152వ సినిమా తెరకెక్కుతున్న సంగతి అందరికి తెలిసినదే. ఈ మూవీలో కొరటాల శివ ఒక స్పెషల్ ఐటమ్ సాంగ్ చేస్తున్నాడు. ఈ పాటను మెగాస్టార్-రెజీనాపై కొరటాల శివ ఇప్పటికే వీరిద్దరిపై సాంగ్ చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ పాటలో రెజీనా చేసిన డాన్స్ ను చూసిన మెగాస్టార్ ఫిదా అయినట్లు తెలుస్తోంది. రెజీనాతో నీలో మంచి గ్రేస్ ఉందని అభినందిచారు. తన డాన్స్ పై మెగాస్టార్ కితాబు ఇవ్వడంతో రెజీనా ఆనందానికి అవధుల్లేకుండా పోతోంది.

 

సాయిధరమ్ తేజ్-రెజీనా నటించిన సుప్రీం హీరోలో మెగాస్టార్ రీమేక్ సాంగ్ ‘గువ్వా గోరింక’లో నటించి మెప్పించింది. తాజాగా మెగాస్టార్ సినిమాలోనే నటించే అవకాశాన్ని దక్కించుకొంది. చిరంజీవి-రెజీనాపై దర్శకుడు ఓ ఫొక్ సాంగ్ చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ సాంగ్లో మెగాస్టార్ తో కలిసి చిందులేసింది. సినిమాల్లేక ఖాళీగా ఉన్న రెజీనాకు మెగాస్టార్ సినిమాలో అవకాశం రావడాన్నే తట్టుకోలేపోతున్న ఈ భామకు ఊహించిన విధంగా చిరంజీవి నుంచి కితాబు వచ్చింది. 

 

మెగాస్టార్ అంతటి వాడే రెజీనా డాన్స్ మెచ్చుకున్నాడంటే ఈ భామ ఈ పాటకోసం బాగానే కష్టపడినట్లు తెలుస్తోంది. మామూలుగానే చిరంజీవి డాన్స్ చేస్తుంటే పక్కన ఉన్న హీరోయిన్ ను అభిమానులు అంతగా పట్టించుకోరు. అయితే మెగాస్టార్ రెజీనాకు కితాబు ఇవ్వడంతో ఈ భామ కూడా డాన్స్ ఇరగదీసినట్లే కన్పిస్తుంది. ఎంతో అదృష్టం ఉంటే తప్ప, మెగాస్టార్ తో నర్తించడం కుదరదు.

 

ఈ ఫోక్ సాంగ్ కి మ్యూజికల్ బ్రహ్మ మణిశర్మ అదిరిపోయే బాణీలు అందించినట్లు తెలుస్తోంది. మణిశర్మ బాణీలకుతోడు మెగాస్టార్, రెజీనా స్టెప్పులకు థియేటర్లు ఊగిపోవడం ఖాయంగా కన్పిస్తుంది. ఈ సినిమాలో త్రిష ప్రధాన హీరోయిన్లగా నటిస్తుంది. స్టాలీన్ మూవీ వీరి కాంబినేషన్లో వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను కూడా రాంచరణే నిర్మిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: