40ఏళ్ల క్రితం రిలీజైన శంకారభరణం తెలుగులోనే కాదు.. తమిళనాడు, కర్ణాటక, కేరళలో కూడా అఖండ విజయం సాధించింది. అమెరికాలో రెగ్యులర్ థియేటర్స్ లో విడుదలైన మొట్టమొదటి చిత్రం ఇదే. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో విడుదలై తెలుగు సినిమా సత్తా చాటింది శంకరాభరణం. అప్పట్లో ఎవరినోట విన్నా ఈ సినిమా ప్రస్తావనే. శంకాభరణం సినిమా ప్రేరణతో చాలామంది కర్ణాటక సంగీతం నేర్చుకున్నారంటే సినిమా ఎంతగా ప్రభావితం చేసిందో అర్థం చేసుకోవచ్చు. 


కమర్షియల్ హంగులు లేకున్నా.. ఘనవిజయం సాధించిన శంకరాభరణం సంచలనం సృష్టించింది. 70వ దశకంలో మాస్ మసాలా చిత్రాల వెల్లువలో కొట్టుకుపోతున్న తెలుగు సినిమా రంగానికి మేలిమలుపు అయ్యింది. అంతగా పేరులేని నటీనటులతో రూపొందిన ఈ చిత్రం అఖండ ప్రజాదరణ సాధించడం విశేషం. ఇక అవార్డుల విషయాలకొస్తే జాతీయ అవార్డుల్లో కళాత్మక విలువలు, వినోదాత్మకంతో కూడిన జనరంజక చిత్రంగా స్వర్ణ కమలం అందుకుంది. తెలుగులో స్వర్ణ కమలం అందుకున్న తొలి తెలుగు చిత్రం కూడా ఇదే. 

 

గాయకులు ఎస్.పి బాలసుబ్రహ్మణ్యంకు ఉత్తమ నేపథ్య గాయకుడిగా తొలిసారి జాతీయ అవార్డు, శ్రీమతి వాణీజయరాంకు ఉత్తమ గాయకురాలిగా, కె.వి మహదేవన్ కు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డులు అందుకున్నారు. సినిమాకు కె.వి మహదేవన్ సంగీతం ప్రాణంగా నిలిచింది. వేటూరి సాహిత్యం పండిత పామరులను ఆకట్టుకుంది. అలాగే నటించిన ప్రతిఒక్కరికీ ఓ ప్రత్యేక గౌరవాన్ని తీసుకువచ్చింది ఈ చిత్రం. 

 

శంకరాభరణంలోని పాటలు ఇప్పటికీ భాషతో సంబంధం లేకుండా అందరూ పాడుతూనే ఉంటారు. ఈ చిత్ర నిర్మాత ఏడిద నాగేశ్వరరావు తాను చెన్నై, హైదరాబాద్ లో నిర్మించిన ఇళ్లకు శంకరాభరణం అనే పేరు పెట్టుకున్నారు. 40ఏళ్లే కాదు.. వందేళ్లు గడిచినా.. కాలం మారినా కలకాలం నిలిచే చిత్రం శంకరాభరణం. 40ఏళ్ల క్రితం రిలీజైన శంకారభరణం తెలుగులోనే కాదు.. తమిళనాడు, కర్ణాటక, కేరళలో కూడా అఖండ విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: