సాధారణంగా హీరోలు ఏడాదికో.. రెండేళ్లకో సినిమా చేస్తూ ఉంటారు. హీరోయిన్స్ మాత్రం మినిమం మూడు సినిమాలతో కనిపిస్తారు. అదేమిటోగానీ.. ఓ స్టార్ హీరోయిన్ మాత్రం రెండేళ్లు గ్యాప్ తీసుకుంది. క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు సినిమాలు చేయాలన్న కాన్సెప్ట్ ను పట్టించుకోని ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు ఈమే..

 

తెలుగులో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన అనుష్క కెరీర్ స్లో అయిపోయింది. 2018 జనవరి 26న వచ్చిన భాగమతి తర్వాత మరో కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రం కాదు కదా.. హీరోయిన్ గా కూడా నటించలేదు. మధ్యలో సైరా సినిమాలో గెస్ట్ అప్పీరియన్స్ మాత్రమే ఇచ్చింది. 

 

భాగమతి తర్వాత అనుష్క నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ నిశ్శబ్ధం. తెలుగుతో పాటు.. దక్షిణాది భాషల్లో.. హిందీలో, ఇంగ్లీష్ లో రిలీజ్ అవుతున్న ఈ పాన్ ఇండియా మూవీకి హేమంత్ మధుకర్ దర్శకుడు. 2020 జనవరి 31న రావాల్సిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యం కారణంగా ఏప్రిల్ 2కు వెళ్లిపోయింది. రెండేళ్ల గ్యాప్ తర్వాత కనిపిస్తోంది బొమ్మాళి. 

 

వరుసపెట్టి సినిమాలు చేయడానికి వెయిట్ ఆమెకు శాపంగా మారింది. నాలుగేళ్ల నుంచి వెయిట్ తగ్గాలని చూస్తున్నా.. ఏ మాత్రం ప్రయోజనం లేదు. దీంతో సినిమా హీరోల పక్కన ఛాన్సులు కూడా మొహం చాటేశాయి. మరి ఎప్పుడు సన్నబడి పెద్ద హీరోల దృష్టిలో పడుతుందో చూడాలి. 

 

అనుష్కకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంతగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. హీరో పక్కన నటించినా.. లేడీ ఓరియెంటెడ్ రోల్ లో మెప్పించినా ఆమె స్టైలే వేరు. అందుకే స్వీటీ సినిమాల కోసం ఆమె అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. ఆ బ్యూటీ యాక్టింగ్ ను కళ్లారా చూసి ఆనందం పొందాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఈ మధ్యలో లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లోనే ఎక్కువగా కనిపిస్తున్న అనుష్క.. హీరోల పక్కన కనిపిస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: