హీరో సాయి ధరమ్‌ తేజ్‌.. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇటీవల చిత్ర లహరి, ప్రతిరోజూ పండగే.. లాంటి చిత్రాలలో ఆయన నటించారు. వరుసగా తన సినిమాలను హిట్ ఖాతాలో వేసుకుంటున్నాడు ధరమ్.. ప్రస్తుతం ఈ  మోగా మేనల్లుడు ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ అనే మూవీలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు కొత్త దర్శకుడు సుబ్బు దర్శకత్వం వహిస్తున్నాడు. 


ఇందులో మోగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. పెళ్లి అంటే ఆమడ దూరం పారిపోయే పాత్రలో కనిపించనున్నాడట. కాబట్టి తేజ్ ఈ పాత్రలో ఎలా ఉంటాడో.. ఆయన ఫ్యాన్స్ ఈ సినిమా కోసం వేచి చూడాల్సిందే మరి..  ప్రస్తుతం షూటింగ్‌ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డేకి విడుదల కానుంది. థమన్‌ మ్యూజిక్‌ అందిస్తున్న ఈ సినిమాలో నభా నటేష్‌ హీరోయిన్‌ గా నటిస్తున్నారు. 


తాజాగా సినిమా విడుదల తేదిని ప్రకటిస్తూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇప్పటి వరకు తేజ్ ఫ్యామిలీ మూవీస్‌ ను టార్గెట్‌ చేశాడు. ఇప్పడు యూత్‌ ను అట్రాక్ట్‌ చేసే దిశగా వెళ్తున్నట్లు కన్పిస్తోంది.  తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్‌లో కూడా సోలో సోదర సోదరీమణులారా అంటూ అదిరిపోయే స్లోగన్ తీసుకొచ్చాడు. ‘సోలో సోదర సోదరీమణులారా...ఈ వాలెంటైన్స్ వీకెండ్‌ మనం అంతా కలిసి జరుపుకుందాం.. మన స్లోగన్‌ ఒకటే. 


'సోలో బ్రతుకే సో బెటర్‌’ అంటూ విడుదల అయిన న్యూ లుక్‌ ద్వారా కార్మికుల దినోత్సవం రోజు 2020 మే1న మూవీని విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. అలాగే వాలెంటైన్స్‌ వీకెండ్‌ లో ఈ మూవీలోని సోలో బ్రతుకే సోబెటర్‌ థీమ్‌ వీడియో సాంగ్‌ రిలీజ్‌ చేయనున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: