టాలీవుడ్ లో ఆ నలుగురిలో ఒకరు అన్న ట్యాగ్ తగిలించుకున్న ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఈయన సినిమాలంటే ముందునుంచి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. అయితే గత కొంతకాలంగా ఆ క్రేజ్ తగ్గుతూ వస్తోంది. దిల్ రాజు మీద కొత్తగా కొన్ని రోజుల నుండి కంప్లైంట్ ఒకటి వస్తోంది. ఇది కంప్లైంటా లేక రూమరా అని ఆరా తీస్తే మొదటిదే అని తాజాగా నెలకొంటున్న పరిస్థితులు చూస్తుంటే తెలుస్తుంది. దిల్ రాజు చిన్న సినిమాలని అసలు పట్టించుకోవడం లేదని ఇండస్ట్రీలో చాలామంది అంటున్నారు. ఆయన బ్యానర్ లో నిర్మించిన కొన్ని చిన్న సినిమాలని అంతగా పట్టించుకోవడం లేదని ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అందుకు ఉదాహరణలు కనిపిస్తున్నాయి. 

 

వాటిలో యంగ్ హీరో రాజ్ తరుణ్ షాలిని పాండే నటించిన ఇద్దరి లోకం ఒకటే ..ప్రస్తుతం రిలీజ్ కి సిద్దంగా ఉన్న జాను సినిమాలని తీసుకోవచ్చు. వాస్తవంగా రాజ్ తరుణ్ సినిమాని దిల్ రాజు ఏ మాత్రం పట్టించుకోలేదు. పాపం కుర్ర హీరో మాత్రం దిల్ రాజు బ్యానర్ లో సినిమా అనగానే చంకలు కొట్టుకుంటూ సరే అన్నాడు. వరుస ఫ్లాపులతో ఉన్న ఈ కుర్ర హీరోకి దిల్ రాజు హిట్ ఇస్తాడనుకుంటే తీసి పక్కన పడేశాడు శర్వానంద్ సమంత పరిస్థితి కూడా అలానే ఉందనిపిస్తోంది. ఈ ఇద్దరు నటించిన కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ జాను రీమేక్ విషయంలో కూడా ఈయన ఇలాగే  వ్యవహరిస్తున్నారు. 

 

చిన్న సినిమా, పెద్ద సినిమా ...ఇలా సినిమా ఏ కేటగిరీకి చెందినదైనా జనంలోకి దూసుకు వెళ్ళాలంటే ప్రమోషన్స్ చాలా ఇంపార్టెంట్. అందుకే రెండు నెలల ముందే ప్రమోషన్స్ మొదలుపెడుతుంటారు మేకర్స్. కొన్ని సంవత్సరాల నుండి అందరూ అదే పద్దతిలో కొనసాగుతున్నారు. కానీ శర్వా, సమంత 'జాను' విషయంలో మాత్రం ఎందుకనో అలా జరగడంలేదని చెప్పుకుంటున్నారు. ఇందుకు దిల్ రాజునే అందరూ వేలెత్తి చూపెడుతున్నారు. సమంత లాంటి స్టార్ హీరోయిన్ ఉన్నా కూడా ఎందుకు జాను సినిమాని పట్టించుకోవడం లేదు రాజు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

ఇంకో నాలుగు రోజుల్లో 'జాను' సినిమా థియేటర్స్ లోకి వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా మీద విపరీతమైన బజ్ రావాలి. ఇప్పటికే తమిళంలో పెద్ద హిట్ కాబట్టి తెలుగులో ఎలా తీశారు ..? క్యూరియాసిటి పెంచాలి. ఇక 96 లో త్రిష ని జాను లో సమంత మాచ్ చేసిందా ..! అయితే ఇప్పటి వరకు అలా బజ్ ఏమాత్రం పెరగనే లేదు. అసలు వస్తున్న సంగతే ఎవరికీ తెలీడం లేదు అదేం విచిత్రమో గాని. కేవలం సినిమా విడుదలకి 4-5 రోజులు మాత్రమె ఉంది. ప్రమోషన్స్ లో పీక్స్ లో ఉండాలి. కాని ఏదీ ..?  

మరింత సమాచారం తెలుసుకోండి: