తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా ప్రతి ఇంటా పగలూ రాత్రీ తేడాలేకుండా ఆ దీపం వెలుగుతూనే ఉంది. అదేనండీ మ‌న‌ కార్తీక‌దీపం. ఒక మామూలు వంటలక్క కి.. సున్నితమైన డాక్టర్ బాబుకి మధ్యలో వచ్చిన మనస్పర్థలు, విడిపోయిన ఆ జంటను కలపాలని చూస్తున్న చిన్నారులు, కోడల్ని సానుభూతితో అర్థం చేసుకున్న అత్తమామ‌లు.. ఎలాగైనా వంటలక్కకి డాక్టర్ బాబుతో విడాకులు ఇప్పించి పెళ్లాడాలనుకుంటున్న మరదలు పిల్ల ఎత్తులు.. ఇది ఈ సీరియ‌ల్‌. ప్ర‌స్తుతం బుల్లితెర బాహుబలిగా కార్తీక‌దీపం హవా కొనసాగుతోంది. వాస్త‌వానికి ఈ సీరియల్ మలయాళంలో మొదట ప్రసారం ప్రారంభం అయింది. 

 

ఇప్పటికీ వేల ఎపిసోడ్లు పైగా దాటిపోయి ఇంకా నడుస్తూనే ఉంది. ఇక వంటలక్క అంటే తెలుగు బుల్లి తెరకే కాదు.. వెండి తెరకు కూడా వణుకు పుట్టించే ఓ ప్రభంజనం. ఇక తాజాగా ఈ సీరియ‌ల్ ఎపిసోడ్‌లో వారణాసి  సౌర్యను సూల్క్ ద‌గ్గ‌ర దింప‌డానికి వెళ్తుంటే.. ఆటోని ఓ వ్యక్తి బండి మీద వెనుక నుంచి గుద్దేస్తారు. వెంటనే ఆ వ్యక్తే ఆవేశంగా వారణాసిని బయటికి లాగి.. ‘ఏంట్రా కళ్లు ఎక్కడ పెట్టి నడుపుతున్నావ్?’ అంటూ కొడుతుంటాడు. మ‌రోవైపు మ‌రో వ్య‌క్తి కూడా వ‌స్తాడు. ఈ క్ర‌మంలోనే ఇద్ద‌రూ వారణాసిని గదమాయించి.. ‘డబ్బులు తియ్యరా’అంటూ హడావుడి చెయ్యడంతో సౌర్య వాళ్లని అడ్డుకుంటుంది. మీదే తప్పు.. మా మావయ్య ఏం తప్పు చెయ్యలేదు అంటూ తిడుతుంది. దీంతో అందులో ఒక‌డు మధ్యలో నువ్వేంటే బుడ్డదానా అంటూ తోసేస్తాడు. 

 

ఇంత‌లో అక్క‌డికి వ‌చ్చిన కార్తీక్ ఏమైంది అంటూ ప్ర‌శ్నిస్తాడు. నే సౌర్య కార్తీక్ వైపు చూస్తూ.. వాళ్లదే తప్పు డాక్టర్ బాబు అంటుంది. వెంటనే కార్తీక్.. బైక్ పడిపోయిన తీరు గమనించి.. కళ్లకు కనిపిస్తుందిగా అతడు ఒక్క పైసా కూడా ఇవ్వడు. మీరు ఇక్కడ నుంచి న్యూసెన్స్ చెయ్యకుండా వెళ్లండి అంటూ వార్నింగ్ ఇస్తాడు. దాంతో ఆ వ్యక్తి రెచ్చిపోతాడు. ఏంటన్నాయ్ నువ్వు ఇంత సపోర్ట్ ఇస్తున్నావ్ వీళ్లకి. వీడేమైనావారణాసి నీకు బావమరిదా? ఆ పిల్ల(సౌర్య)ని అంత జాగ్రత్తగా పట్టుకున్నావేంటీ? అదేమైనా నీ కూతురా? లేక నీ సెటప్ కూతురా?’ అంటూ నోటికి వచ్చినట్లు వాగుతుంటాడు. దీంతో కార్తీక్ ఉగ్రరూపమొత్తి వాడిని ఒక్క‌టి పీకుతాడు. అంతే వెంట‌నే ఇద్ద‌రూ అక్క‌డ నుంచి పారిపోతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: