పవర్ స్టార్ ఈ పేరు థియేటర్ లో కనపదం గానే ఈలలు కేకలతో హాల్ మొత్తం దద్దరిల్లిపోతుంది. పవర్ స్టార్ స్క్రీన్ మీద కనపడం గానే  పూలతో, పేపర్లతో స్క్రీన్ ను చించినంత పని చేస్తారు ఆయన అభిమానులు. అశేష అభిమానం ఆయన సొంతం, అలుపెరగని పోరాటం ఆయన నైజం. నైజాం, సీడెడ్, కోస్తా ప్రాంతం ఏదైనా ఆయన కోసం ప్రాణాలిచ్చే అభిమానులు ఆయన సొంతం. రాష్ట్రం దాటి తెలుగువాడి సినిమా సత్తా ఏమిటో చూపిన హీరో. దక్షిణాది రాష్ట్రాల్లో ఆయనో పవర్ స్టార్.

 

 కానీ పవన్ కళ్యాణ్ సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి రావాలనుకున్నపుడు, ఆయన ఇక మీదట నేను సినిమాలు చేయలేకపోవచ్చు అన్నప్పుడు ఆయన అభిమానులు పడ్డ ఆవిడేనా అంత ఇంత కాదు. తమ హీరో ను ఇక మీద సినీ స్క్రీన్ పై చూడలేమా అనుకొంటూ, నువ్వు కచ్చితంగా సినిమాలు చేయాలి అన్నయ్య అంటూ ఆయన అభిమానులు గగ్గోలు పెట్టారు. కాలనీ ఆయన రాజకీయాల్లో మార్పు కోసం తన సినీ జీవితాన్ని త్యాగం  చేసి ప్రజా క్షేత్రం లోకి పయన మయ్యాడు. 

 

   గత ఎన్నికల్లో ఓటమి పాలైనా, సూటిపోటి మాటలు గుచ్చుతున్నా చిరు నవ్వు తో స్వీకరించాడు. తాను వెను దిరిగి వెళ్లే ప్రసక్తే లేదని, తన రాజకీయ జీవితం ఒక్క ఓటమి ఆపలేదని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. కానీ పార్టీ ను బలోపేతం చేయాలంటే దానికి డబ్బు చాలా అవసరమని, తననుఁ నమ్ముకున్న వారికి ఆర్ధిక ఇబ్బందులు కలగకుండా చేయాలని ఆయన భావించి, మళ్ళీ సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు పవర్ స్టార్.

 

   పవన్ కళ్యాణ్ తన రే ఎంట్రీ సినిమా గా హిందీ లో హిట్ అయినా పింక్ సినిమాను రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆయన లాయర్ షబ్ గా పవర్ ఫుల్ లాయర్ క్యారెక్టర్ చేయబోతున్నారు. వెంటనే పవన్ ఇంకో సినిమా క్రిష్ జార్లమూడి దర్శకత్వంలో చేయడానికి ఆయన పచ్చ జెండా ఊపేశారు.ఇందులో ఆయన ఒక స్వాతంత్ర్య సమర యోధుడి పాత్ర లో నటించ బోతున్నాడు.

 

  ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన మూడో సినిమాకు కూడా పచ్చ జెండా ఒప్పేశారు. తన మూడో సినిమాను గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో చేయబోతున్నాడు.  మైత్రీ మూవీస్ బ్యానర్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించడంతో ఆయన అభిమానుల్లో ఆనందం వ్యక్తం అవుతుంది. పవన్ కళ్యాణ్ తన ఒక్కో సినిమాకు రెమ్యూనరేషన్ కింద 50 కోట్లు తీసుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అది పవన్ కళ్యాణ్ రంజీ అంటే అని ఆయన అభిమానులు సంబరపడిపోతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: