సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ కి ఏది ఉన్నా లేకపోయినా కడుపు నిండా కాంట్రవర్సీలుంటే చాలు హాయిగా పడుకొని పొద్దుటే లేచి పోర్న్ చూస్తూ డే స్టార్ట్ చేస్తాడు. హరీష్ శంకర్, కృష్ణ వంశీ, శ్రీను వైట్ల, డేరింగ్ అండ్ డషింగ్ పూరి జగన్నాధ్ దగ్గర్నుంచి మొన్న వచ్చిన ఆర్.ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి వరకు ఉన్న శిశ్యుల లిస్ట్ చాంతాడంతే ఉంది. అయితే వర్మ కి మాత్రం పూరినే స్పెషల్. అందుకే పూరి దగ్గినా తుమ్మినా వర్మ వచ్చి హైదరాబాద్ లో వాలిపోతాడు. 

 

గత కొంతకాలంగా అటు వర్మకి గాని ఇటు పూరికి గాని మంచి హిట్ పడలేదు. అయితే రీసెంట్‌గా పూరికి మాత్రం ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ పడింది. దాంతో పూరి ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఒక్క పూరి మాత్రమే కాదు హీరో, హీరోయిన్స్, వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ చార్మి, మ్యూజిక్ డైరెక్టర్ మెలోడి బ్రహ్మ మణిశర్మ ..ఇలా వరుసబెట్టి ఈ సక్సస్ ని తమ ఖాలో వేసుకున్నారు. ఇక ఆ సినిమా సక్సస్ పార్టీ అంటూ వర్మ చేసిన హంగామా అందరూ చూసిందే. చార్మీకి అలవాటేమో బాగా కేకలతో నానా రచ్చ చేసి ఎంజాయ్ చేసింది గాని హీరోయిన్స్ మాత్రం హడలి చచ్చారు వర్మ చేష్టలకి.

 

ఇక పూరి దేవరకొండతో ఫైటర్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా యమా స్పీడ్ గా షూటింగ్ జరుగుతోంది. అంతేకాదు ఈ సినిమాలో బాలీవుడ్, టాలీవుడ్ హీరోలందరికీ ధీటుగా విజయ్ దేవరకొండను పాన్ ఇండియా స్టార్ ని చేయాలన్న కసి తో ఉన్నాడు పూరి. ఈ నేపథ్యంలో పూరి కలిసిన వేళ ఇద్దరు నానా రచ్చ చేశారు. పూరి అంటే పిచ్చ ప్రేమ ఉన్న వర్మ ఆయన్ని గట్టిగా పట్టుకొని నలిపేశాడు.

 

అంతేకాదు పిడికిలి బిగించి ఎవరినో సవాల్ చేస్తున్నట్టు ఫోజిచారు ఈ గురు శిశ్యులిద్దరు. ఇది చూసిన కొందరు ఫ్యాన్స్ తమ కామెంట్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పూరి గారు నేను మీకంటే బెటర్ ఫైటర్ ని అంటూ వేరొక అభిమాని ట్వీట్ చేశాడు. గ్రేట్ పర్సన్స్ ఇన్ వరల్డ్ నో మోర్ వర్డ్స్ అంటూ ఇంకొకరు క్యాప్షన్ ఇచ్చారు. నో నో మీరిద్దరూ 'గే' కపుల్ లా ఉన్నారు! అంటూ ఒకరైతే ఫన్ గా కామెంట్ చేశారు. పచ్చి తాగుబోతులు అన్న అర్థం వచ్చేలా ఒక ఫాన్ ట్వీట్ చేశాడు! ఇలా రక రకాల కామెంట్స్ పెడితే ఒకరు మాత్రం 'పాపం పూరి నలిగిపోతున్నాడు వదలవయ్యా వర్మా' .. అంటూ కాస్త చిలిపి కామెంట్ చేశాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: