గత నెల 31న విడుదలైన ‘చూసీ చూడంగానే’ సినిమా మంచి కలెక్షన్స్‌ సాధించే దిశగా సాగుతోంది. ఈ సినిమాకు పాజిటివ్‌ టాక్‌ రావడంతో ఆ చిత్ర యూనిట్‌ కూడా సంతోషం వ్యక్తం చేస్తోంది. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో నిర్వహించిన థ్యాంక్స్‌ మీట్‌లో చిత్ర యూనిట్‌ సభ్యులు మాట్లాడారు.

 


ముందుగా సినిమా నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. నేను తీసిన సినిమాలన్నీ నాకు పరీక్షలేనని, రిజల్ట్‌ మేము అనుకున్న దాని కంటే కాస్త అటు, ఇటుగా వస్తుందని చెప్పారు. ‘చూసీ చూడంగానే’ సినిమాకు కూడా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. సినిమా బాగుందని అందరూ ఫోన్‌ చేస్తున్నారు. యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీతో సినిమా తీయడంతో అందరికీ కనెక్ట్‌ అవుతోంది. శేష సింధు కొత్త డైరెక్టర్‌ అయినప్పటికీ మంచి అవుట్‌ పుట్‌ ఇచ్చారు. ఆరిస్టులు, టెక్నీషియన్లు కూడా చాలా కష్టపడి పనిచేశారు. హీరోయిన్‌ వర్ష బొమ్మలకు ఇది తెలుగులో మంచి లాంచ్‌ అవుతుంది. మాళవిక తన నటనతో ఆకట్టుకోగా, మా అబ్బాయి శివ‌కు మొదటి సినిమా అయినప్పటికీ ఎంతో అనుభవం ఉన్నవాడిలా నటించాడు. ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న అందరికీ ధన్యవాదాలు.

 


డైరెక్టర్‌ శేష సింధు మాట్లాడుతూ.. ‘సినిమా చూసిన వాళ్లంతా బాగుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సినిమా ద్వారా మా హీరో శివకి, హీరోయిన్లు వర్ష, మాళవిక మంచి పేరొచ్చింది. ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన నిర్మాతకు థ్యాంక్స్‌. 
హీరో శివ మాట్లాడుతూ సినిమాను చాలా సహజంగా తీయాలని అనుకున్నాం.. అలాగే తీశాం. మా సినిమా యువతతో పాటు అన్ని వర్గాలకు నచ్చుతోంది. నాకు ఇదే మొదటి సినిమా అయినప్పటికీ బాగా చేశానని ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నా క్యారెక్టర్ ని కొత్తగా చూపడం వల్లే ఆర్డియన్స్‌కు నచ్చింది. మొదటి సినిమాకే ఇంతమంచి రెస్పాన్స్ రావడం సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్‌ చెప్పారు హీరోయిన్స్ వర్ష బొల్లమ్మ, మాళవిక.

మరింత సమాచారం తెలుసుకోండి: