రమణ తేజ దర్శకుడిగా పరిచయమవుతూ టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య, మేహరీన్ జంటగా తెరకెక్కించిన సినిమా 'అశ్వథ్థామ'. నాగశౌర్య సొంత బ్యానర్ ఐరా క్రియేష‌న్స్ లో శంక‌ర్ ప్ర‌సాద్ ముల్పూరి స‌మ‌ర్ప‌ణ‌లో ఉషా ముల్పూరి ఈ సినిమాను నిర్మించారు. మొదటిసారి యాక్షన్ జోనర్ తో నాగశౌర్య నటించిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటి వరకు శౌర్య తన సొంత బ్యానర్ లో ఛలో, నర్తనశాల, ఇప్పుడు అశ్వధామ సినిమాలు తీశారు. వాటిలో ఛలో మంచి హిట్ టాక్ ని తెచ్చుకొని మొదటి సినిమాగా మంచి లాభాలను తెచ్చి పెట్టింది. కానీ ఆ తర్వాత వచ్చిన నర్తనశాల మాత్రం భారీ డిజాస్టర్ గా మిగిలింది. దాంతో ఒక సినిమాతో వచ్చిన క్రేజ్, డబ్బు రెండవ సినిమాతో ఊడ్చుకుపోయింది. దాంతో మళ్ళీ మొదటి సినిమా స్థాయి హిట్ కొట్టాలని గట్టి ప్రయత్నమే చేశాడు శౌర్య. 

 

ఇక ఛలో తర్వాత శౌర్య సినిమాలన్ని వరుస బెట్టి ఫ్లాపవుతూ వచ్చాయి. దాంతో చిన్న గ్యాప్ తీసుకొని 'అశ్వథ్థామ' తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 2020 లో ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని భావించాడు. కానీ అది కాస్త గట్టి దెబ్బేసింది. కాస్తో కూస్తో యూత్ ఆడియన్స్ లో క్రేజ్ ఉన్న నాగశౌర్య ఈ సినిమాతో మొత్తం పోగొట్టుకున్నాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నాడు. ముఖ్యంగా కథకు అనుకున్న ప్లాట్ పెద్ద మైనస్ అని అందరూ అంటున్నారు. ఏమాత్రం ఆసక్తి కరంగా సాగని కథనం తో ప్రేక్షకుల సహనానికి శౌర్య పెద్ద పరీక్ష పెట్టాడని దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.

 

అంతేకాదు ఎన్నో అంచనాలు పెట్టుకున్న నాగశౌర్య కి ఈ సినిమా కూడా నిరాశపరచింది. ఇప్పటి వరకు క్లాస్ సినిమాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న శౌర్య మొదటిసారి అనవసరంగా మాస్ ఎలిమెంట్స్ తో కాస్త యాక్షన్ సినిమాని ట్రై చేస్తే ఇల్లు ఒళ్ళు మొత్తం అంటుకుందని ట్రోల్ చేస్తున్నారు జనాలు. అసలు పెట్టిన డబ్బు కూడా రాదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ సినిమాలో కథ, కథనం, హీరోయిన్ ఇలా చెప్పుకుంటూ పోతే బూతద్దం లేకుండానే అన్ని మైనస్ లు కనిపిస్తున్నాయి తప్ప ప్లస్ లు కనిపించడం లేదట. ఇక కొంతమది నాగ శౌర్య అనవసరంగా ఈ జోనర్ ని అటెంప్ట్ చేశాడని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: