నాగ శౌర్య హీరో గా నటించిన మొదటి సినిమా ఊహలు గుస గుసలాడే. నటుడు దర్శకుడు అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో మంచి సక్సస్ ని అందుకున్నాడు. ఆ సినిమా నుండే టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోల్లో ఒక సపరేట్ ఇమేజ్ ని దక్కించుకున్నాడు. ముందు నుంచి శౌర్య హీరోగా నటించిన సినిమాలకి భారీ అంచనాలు అంటూ ఏమీ ఉండదు. అయినప్పటికి కొన్ని హిట్స్ శౌర్య తన ఖాతాలో వేసుకున్నాడు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. ఇక సొంత బ్యానర్ లో నటించిన ఛలో సినిమాతో నాగశౌర్య కి మంచి మార్కెట్ కూడా స్థాపించుకున్నాడు.

 

సినిమా మంచి కమర్షియల్ హిట్ గా నిలిచింది. దాంతో శౌర్య తన సొంత బ్యానర్ లోనే ఎక్కువగా సినిమాలు చేయడానికి ప్లాన్ చేసుకున్నాడు. బయట నిర్మాతల సినిమాలకి కమిటవడం దాదాపు తగ్గించేశాడు. ఇక మళ్ళీ సొంత బ్యానర్ లో చేసిన నర్తనశాల సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఇక తాజా చిత్రం అశ్వద్ధామ కూడా తన సొంత బ్యానర్ లోనే నిర్మించాడు. ఈ సినిమా కూడా మొదటి షో నుండే సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చింది.

 

ప్రస్తుతం సమాజంలో ఆడవాళ్ల మీద జరుగుతున్న అఘాయిత్యాలను ఆధారంగా చేసుకొని ఈ కథ తయారు చేసుకున్నట్టు నాగ శౌర్య ఇది వరకే తెలిపాడు. అయితే ఇక్కడ కథ, కథనాలు సినిమాకి పెద్ద మైనస్ అని రెగ్యులర్ సినిమాల పంథాలో సాగడం తో ఆడియన్స్ ఏం సినిమా రా బాబు అంటూ పెదవి విరిచారు. ఫస్ట్ హాఫ్ వరకు స్క్రీన్ ప్లే జస్ట్ ఓకే తప్ప సినిమాలో ఏం చూపించారో అని ఫ్యాన్సే తిట్టుకుంటున్నారు. ఏ సినిమాకైనా ఇంట్రవెల్ ట్విస్ట్, ప్రీ క్లైమాక్స్ చాలా ఇంపార్టెంట్. కానీ ఈ సినిమాలో కరువయ్యాయి. ఏదో డబ్బులు పెట్టి టికెట్ తీసుకున్నాం కదా కాసేపు ఏ.సి లో కూర్చొని వెళదామని అనుకుంటున్నారే తప్ప సినిమా బావుందని కాదట.

 

ఇక ప్రస్తుతం సమాజంలో నిర్భయ, దిశ వంటి అఘాయిత్యాలను ఆధారంగా చేసుకొని సామాజిక అంశం మీద హీరో నాగ శౌర్య స్వయంగా ఈ సినిమాకి కథ రాశాడు. ఇంకా చెప్పాలంటే స్నేహితుడి చెల్లికి జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా కథ రాసుకున్నాడు. దాంతో సహజంగా సినిమా మీద కాస్త అంచనాలు పెరిగాయి. ఎందుకంటే ఇప్పటి వరకు సామాజిక అంశంతో తీసిన సినిమాలు దాదాపు సక్సస్ అయ్యాయి. కాని అశ్వద్ధామ కి మాత్రం మార్నింగ్ షో నుండే డివైడ్ టాక్ వచ్చి నాగశౌర్య కి భారీ ఫ్లాప్ పడినట్టే అని ప్రేక్షకులు అంటున్నారు. ఇక కొంతమంది ఆడియన్స్ అయితే ఈ సినిమాలో హీరోగా నటిస్తే సరిపోయోది ..నీ కెందుకు ఈ కథ గోల ...నీకేమొచ్చింది. భారీ ఫ్లాప్ తప్ప అని వెటకారంగా అంటున్నారట.   

మరింత సమాచారం తెలుసుకోండి: