పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి తర్వాత సినిమాల పరంగా అజ్ఞాతంలోకి వెళ్ళిన పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా పుట్టలో ఉన్న నాగుపాములా బుసలు కొట్టుకుంటూ బయటకు వచ్చాడు. జనం కోసమే జనసేన అన్న పవర్ స్టార్ ఫ్యాన్స్ కోసమే సినిమాలు అంటూ సైలెంట్ గా మొదలెట్టారు. రాజకీయాల పరంగా జనసేనుడు సైనికుడిలా అటు కాసేపు ఇటు కాసేపు గెంతినప్పటికి అవి కుప్పి గంతులే అని అర్థమైపోయింది. ఎటొచ్చి రాజకీయాలలో ధీన పరిస్థితికి వచ్చింది మాత్రం ఒక్క పవన్ కల్యాణ్ మాత్రమే. ఫ్లాపులొచ్చినా సినిమాల జోరు గనక కొనసాగించి ఉంటే మాత్రం అయ్యగారు అపాయింట్ మెంట్ కూడా దొరికేది కాదు. కానీ ఇప్పుడు అయ్యగారికే అపాయింట్ మెంట్ దొరక్క బిక్క మొహం తో ఢిల్లీ నుంచి తిరిగొచారు. కాస్త గడ్డం పెంచి ఫేస్ లో ఎక్స్‌ప్రేషన్స్ కవర్ చేస్తున్నారు గాని లేకపోతే అత్తారింటికి దారేది లో క్లైమాక్స్ లా కనబడేది పాపం. లేదా సింహం డైలాగ్ మర్చిపోయినట్టున్నాడు లేకపోతే గడ్డం గీసుకునే వాడేమో. 

 

ఇక సిల్వర్ స్క్రీన్ మీద మాత్రం పవర్ స్టార్ రేంజే రేంజు. తొలిప్రేమ సినిమా నుండి పవన్ కు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. అందుకే అన్నయ్య మెగాస్టార్ లా పవన్ కళ్యాణ్ రీఎంట్రీ గత కొంతకాలంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్ గా సాగుతోంది. పవన్ 'పింక్' రీమేక్ చాలా రోజుల నుండి వార్తల్లోనే ఉండి ఒక్కసారిగా ఫస్ట్ షిఫ్ట్ డ్యూటీ లా మొదలెట్టారు. అంటే ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 2 వరకనమాట. పట్టుమని పదిరోజులన్నా పింక్ సినిమా షూటింగ్ జరిగిందో లేదో కంగారుగా క్రిష్ దర్శకత్వంలోనే మరో సినిమా కూడా లాంచ్ అయింది. ఏ.ఎం రత్నం నిర్మాణంలో ఈ సినిమా రూపొందబోతోంది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా ఉంది అదే ఈ సినిమాకి మరో నిర్మాతగా క్రిష్ కూడా వ్యవహరిస్తున్నారట. అంటే క్రిష్ కి రెమ్యూనరేషన్ ఉండదు ..పైగా డబ్బు పెట్టాలి. వస్తే లాభాల్లో వాటా. లేదంటే టాటా. ఇక ఈ రెండు సినిమాల గురించి రోజుకో గాలి వార్త వినబడుతుండగానే మూడో సినిమా హరీష్ శంకర్ - మైత్రీ మూవీ మేకర్స్ తో ఫిక్స్ అయిందని తాజా సమాచారం. 

 

'పింక్' రీమేక్ పూర్తి కాగానే క్రిష్ తెరకెక్కించే సినిమా, తర్వాత హరీష్ శంకర్ సినిమాకి పవర్ స్టార్ డేట్స్ ఇస్తారట. ఇప్పటి నుంచి పవన్ నాన్ స్టాప్ గా సినిమాలు చేస్తారని సమాచారం. ఈ మూడు సినిమాలతో పాటు ఇంకా మరికొన్ని ప్రాజెక్టులు కూడా లైన్ లో పెట్టాడట పవర్ స్టార్. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రామ్ తాళ్లూరికి ఒక సినిమా చేస్తానని.. హారిక హాసిని క్రియేషన్స్ వారికి ఒక సినిమా చేస్తానని మాటిచ్చారట. అయితే ఇది బయటకు చెప్పుకుంటున్న మాట. మాటివ్వడం కాదు ముందే అడవాన్స్ తీసుకున్నాడట. ఇది లోలోపల చెప్పుకునే మాట.  నిర్మాతలని లైన్ లో పెట్టుకొనే దర్శకుల పవన్ స్క్రిప్టులు రెడీ చేయిస్తున్నారట. పవన్ కి అత్యంత సన్నిహితుడైన డాలీ.. పూరి జగన్నాధ్ లు కూడా పవన్ ఇమేజ్ కి తగ్గట్టుగా బలమైన కథలను తయారు చేస్తున్నారట. అయితే ఇంతమంది ఉన్నా హారిక హాసిని క్రియేషన్స్ లో తెరకెక్కే సినిమాకి మాత్రం పవన్ ప్రాణం అయిన త్రివిక్రం దర్శకత్వం వహించడం ఖాయం. మరి పవన్ కి ఒక్కసారిగా ఇంత మూడ్ ఎందుకొచ్చిందో తెలీడం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: