తెలుగు ఇండ‌స్ట్రీలో వార‌స‌త్వంతో ఎంట్రీ ఇచ్చే న‌టీమ‌ణుల సంఖ్య చాలా త‌క్కువ‌గా ఉంటుంది. బాలీవుడ్‌లో అలాంటిదేమీ ఉండ‌దు కానీ. హీరోలయినా, హీరోయిన్ల‌యినా ఒకే త‌ర‌హాలో ఎంట్రీ ఇస్తారు. ఇక్క‌డ న‌టీమ‌ణులు రావ‌డానికి పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌రు. అది ఫ్యామిలీ మెంబ‌ర్స్ అయినా, ఫ్యాన్స్ అయినా చాలా రూల్స్ పెడ‌తారు. అందుకు తెలుగు ఇండ‌స్ట్రీలో పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌రు. గ‌తంలో ఇలాగే హీరో కృష్ణ కూతురు మంజుల కూడా ఒక‌ప్పుడు హీరోయిన్‌గా రావాల‌నుకుంది కానీ అందుకు ఫ్యాన్స్ మాత్రం నిరాక‌రించారు. త‌ర్వాత మోహ‌న్‌బాబు కూతురు మంచు ల‌క్ష్మి కూడా కొన్ని చిత్రాల్లో న‌టించింది. 

 

ఇప్పుడు మెగా డాట‌ర్  నిహారిక నాగ‌బాబు కూతురు తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. కొన్ని విభిన్న‌మైన చిత్రాల్లో న‌టించింది కానీ ఆశించినంత ఫ‌లితం రాలేదు.  మొదట్లో మెగాభిమానులు ఆమె ఎంట్రీ పై కస్సుబస్సులాడారు. కానీ నాగబాబు వారికా న‌చ్చ‌జెప్పి కేవ‌లం మంచి పాత్ర‌ల్లో మాత్ర‌మే న‌టిస్త‌ది. ఎటువంటి హాట్ పాత్ర‌ల్లో న‌టించ‌ద‌ని వారికి మాట ఇచ్చారు. అందుకే నిహారిక వెబ్ సిరీస్ వైపు దృష్టి సారించింది. ప్ర‌స్తుతం ఆమె మ్యాడ్ హౌస్ అనే వెబ్‌సిరీస్‌లో న‌టిస్తూ ఫుల్ బిజీగా ఉంది. 

 

ఇక సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ త‌న హాట్ హాట్ ఫొటోస్‌ని ట్విట‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల‌లో త‌న హాట్ పిక్స్‌ని షేర్ చేస్తూ వస్తోంది. నిత్యం త‌న అభిమానుల‌కు ట‌చ్‌లో ఉంటుంది.  మోడర్న్ డ్రెస్ లో నీహారికా హాట్ హాట్ ఫొటోస్‌తో అభిమానుల‌కు స‌డెన్ షాక్ అయింది. ప్ర‌స్తుతం నీహారిక కాస్త హాట్ లుక్స్‌లో న‌టించ‌బోతుంద‌ని కొంత  స‌మాచారం ఇచ్చిన‌ట్ల‌యింది ఈ ఫొటోస్. అసలు ఎక్స్‌పోజింగ్ ఏమీ లేదని, డ్రెస్ డిఫరెంట్‌గా ఉండడంతో అలా అనిపిస్తుంది. మరికొందరు ఈ ఫోటోలలో నీహారిక బాలీవుడ్ భామ సారా అలీ ఖాన్ మాదిరి ఉందని కామెంట్స్ చేస్తున్నారు. కొంద‌రు మంచి మంచి కామెంట్స్ ఇస్తుంటే మ‌రి కొంద‌రు హాట్ పిక్స్ షేర్ చేసినందుకు త‌న త‌ర్వాత చిత్రాల్లో అలా క‌నిపించ‌బోతుందేమో అని ఆందోళ‌న చెందుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: