సమంత అక్కినేని, శర్వానంద్ జంటగా నటిస్తున్న తమిళ 96 రీమేక్ చిత్రం జాను. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తుండగా... ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 7వ తారీఖున రిలీజ్ కానుంది. అయితే శనివారం సాయంత్రం హైదరాబాదులో జాను చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను దర్శక నిర్మాతలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నాని తనదైన శైలిలో బ్రహ్మాండమైన స్పీచ్ ఇచ్చారు.



ఈ సినిమాలో 'పదినెలలు మోసి కన్న మీ అమ్మకు నువ్వు సొంతమైతే.. ఇన్నాళ్లుగా మనసులో మోస్తున్న నాకు కూడా సొంతమే', అనే డైలాగ్ ని సమంతాని ఉద్దేశిస్తూ శర్వానంద్ చెబుతాడు. అయితే ఈ డైలాగ్ ని న్యాచురల్ స్టార్ నాని మాత్రం మార్చేసి.. 'పది నెలలు కష్టపడి జానును తీసిన ప్రొడ్యుసర్‌కి సొంతం అయితే.. ఫిబ్రవరి 7 నుండి అది చూసి ఎంజాయ్ చేసే మీకందరికీ కూడా సొంతమే', అంటూ అందర్నీ కట్టిపడేసారు.


తమిళ 96 సినిమాలో హీరో విజయ్ సేతుపతి, త్రిష చాలా చక్కగా నటించారు. ఆ సినిమాని తెలుగులో తీస్తే ఆ సినిమాకి ఉన్న అందం పోతుందని హీరో నాని భావించారట. అందుకే తెలుగులో ఇటువంటి సినిమా తీయకూడదని చెప్పారు కూడా. కానీ దిల్ రాజు శర్వానంద్, సమంత లాంటి మంచి నటీనటులతో జాను సినిమా తీసేసరికి.. తాను అన్న వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని ఆయన చెప్పారు. అంతేకాదు తెలుగులో సినిమా తీయకూడదని చెప్పిన అతనే.. తెలుగులో తమిళ రీమేక్ 96 ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వేచి చూస్తున్నాడు. ట్రైలర్ చూసిన తర్వాత సినిమా చూడాలన్న తన కోరిక ఇంకా పెరిగిపోయిందని చెప్పుకొచ్చారు నాని.


శర్వానంద్ ఏ సినిమా తీసినా.. ఆ సినిమా హిట్టు కాకపోయినా.. అతనికి మాత్రం గుర్తింపు తప్పకుండా వస్తుంది. ఎందుకంటే తన నటన చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే తమిళంలో విజయ్ సేతుపతిని స్వచ్ఛమైన ప్రేమ కథ సినిమా అయిన 96 కోసం తీసుకుంటే.. తెలుగులో శర్వానంద్ ని తీసుకున్నారు. జాను చిత్రం గురించి చెప్పాలంటే.. కొన్ని సినిమాను చూస్తాం.. ఎంజాయ్ చేస్తాం... ఇంటికి వెళ్ళిపోతాం.. కొన్ని సినిమాలు చూస్తాం.. ఎంజాయ్ చేస్తాం.. ఇంటికి తీసుకొని వెళ్లిపోతాం. మరి జాను కూడా ఇంటికి తీసుకుని వెళ్ళి పోయే చిత్రమే అని నాని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: