యంగ్ హీరో శర్వానంద్ గాసిప్పులకు చాల దూరంగా ఉంటాడు. అయితే ఈ హీరోకి కూడ ఒక లవ్ బ్రేకప్ ఉంది అన్న విషయం నిన్న జరిగిన ‘జాను’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో స్వయంగా శర్వానంద్ బయటపెట్టడం ఆ ఫంక్షన్ కు హాట్ న్యూస్ గా మారింది. ‘జాను’ సినిమాలోని హీరో పాత్రలానే తనకు కూడ చిన్నతనంలో ఒక లవ్ బ్రేకప్ వ్యవహారం ఉందని అందువల్లనే ఇప్పటికీ తాను ఇంకా పెళ్ళి చేసుకోలేదు అంటూ తనకు నచ్చిన ‘జాను’ లాంటి అమ్మాయి ఇంకా దొరకలేదు అంటూ జోక్ చేసాడు. 

మూవీ కథ గురించి మాట్లాడుతూ ఇప్పటి తరంలో పిల్లలు 8వ క్లాసు నుండి ప్రేమించడం ఒక ఫ్యాషన్ గా పెట్టుకున్న పరిస్థితులలో ఈ మూవీ కథ నేటి తరం ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది అంటూ కామెంట్ చేసాడు. ఇక ఈ మూవీ హీరోయిన్ సమంత గురించి మాట్లాడుతూ శర్వానంద్ చేసిన కామెంట్స్ చాలామందికి షాక్ ఇచ్చాయి.

నిత్యామీనన్ సాయి పల్లవి సమంత లతో నటించాలి అంటే చాల కష్టం అని చెపుతూ వీరంతా వైరస్ కన్నా భయంకరమైన వ్యక్తులు అనీ వారితో పోటీగా నటించకపోతే వైరస్ శరీరం పై దాడి చేసి ఎలా నిర్వీర్యం చేస్తుందో వీరి ముందు ఏహీరో అయినా తెలిపోతాడు అంటూ కామెంట్ చేసాడు. అంతేకాదు ‘జాను’ విడుదలైన తరువాత ప్రేక్షకులు అంతా సమంత పాత్ర గురించే మాట్లాడుకుంటారు అంటూ ఈ మూవీ పై అంచనాలు పెంచాడు. 

ఈ ఫంక్షన్ కు అతిధిగా వచ్చిన నాని ఈ ఫంక్షన్ లో శర్వానంద్ పై వేసిన జోక్స్ దానికి శర్వా వేసిన రివర్స్ పంచ్ తో ‘జాను’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉల్లాస భరితంగా జరిగింది. ఈమధ్య కాలంలో శర్వానంద్ సినిమాల పరిస్థితి ఏమాత్రం బాగాలేని స్థితిలో ‘జాను’ హిట్ ను బట్టి శర్వానంద్ కెరియర్ ఆధారపడి ఉంటుంది అన్న విషయం నిజం..

 

మరింత సమాచారం తెలుసుకోండి: