తెలుగు సినిమా పరిశ్రమలో శంకరాభరణం సినిమాకు ప్రత్యేకమైన స్థానం ఉంటుందని చెప్పొచ్చు. కె.విశ్వనాథ్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో జేవి సోమయాజులు, మంజు భార్గవి, చంద్ర మోహన్ నటించారు. సంగీత ప్రాధాన్యతతో వచ్చిన ఈ సినిమా రిలీజ్ ముందు సినిమాకు పెద్దగా బజ్ లేకున్నా రిలీజ్ తర్వాత సినిమాకు ప్రేక్షకులు నీరాజనాలు అందించారు. శాస్త్రీయ సంగీతానికి తెలుగు ప్రేక్షకులు ఇచ్చిన బహుమానంగా శంకరాభరణం సక్సెస్ అని చెప్పొచ్చు.

 

జేవి సోమయాజులు ప్రధాన పాత్రగా తెరకెక్కిన ఈ సినిమా ఈ స్థాయి విజయాన్ని అందుకుంటుందని ఎవరు ఊహించలేదు. సంగీత ప్రాధ్యతతో వచ్చిన ఈ సినిమా థియేటర్ లోకి అడుగు పెట్టే ముందు ఒక అనుభూతితో వెళ్తే.. సినిమా చూసిన్ థియేటర్ నుండి బయటకు వచ్చేప్పుడు మాత్రం ఎంతో తృప్తిగా ఉంటుంది. అప్పటికే సినిమాను నడిపించేది హీరో ఇమేజ్ అన్న సంకేతాలు ఉన్న తరుణంలో సోషల్ సినిమాలు, డ్యూయెట్లు, వెస్ట్రెన్ సాంగ్స్ అలవాటు చేస్తున్న తరుణంలో సంగీత ప్రధానంగా వచ్చిన శంకరాభరణం సక్సెస్ తెలుగు ప్రేక్షక హృదయాలు ఎంత విశాలమైనవే.. ఎంత టేస్ట్ కలిగినవో సినిమా సక్సెస్ అయిన విధానం చూస్తే తెలుస్తుంది.

 

తెలుగు సినిమాకు శంకరాభరణం ఒక ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. ఆ సినిమా సక్సెస్ అయిన తర్వాతే సంగీతానికి ప్రాధాన్యత ఇస్తూ సినిమాలు చేసినా సరే సినిమాలు చూస్తారని ప్రూవ్ అయ్యింది. విశ్వనాథ్ దర్శకత్వ ప్రతిభ కె.వి.మహదేవన్ అద్భుతమైన సంగీతం సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లాయి. ఇప్పటికి శంకరాభరణం సాంగ్స్ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయాయి. 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా తక్కువే అని చెప్పొచ్చు.  
 

మరింత సమాచారం తెలుసుకోండి: