టాలీవుడ్ లోకి చిన్న చిన్న పాత్రల్లో నటించిన రవితేజ తర్వాత డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఇడియట్’ సినిమాతో హీరోగా మారారు.  ఈ మూవీ అప్పట్లో యూత్ కి ఆకట్టుకుంది.  పోలీస్ కమీషనర్ కూతురుకి పెళ్లి కాదా.. వాళ్లకు మొగుళ్లు రారా.. సిటీకి కమీషనర్లు ఎంతో మంది వస్తుంటారు.. పోతుంటారు.. చంటిగాడు లోకల్ ..  ఈ డైలాగ్స్ అప్పట్లో ట్రెండ్ సృష్టించాయి.  ఆ తర్వాత రవితేజకు రాజమౌళి దర్శకత్వంలో విక్రమార్కుడు తో మరో హిట్ ఇలా వరుసగా హిట్ సినిమాలు అందుకున్నాడు రవితేజ.  బాబీ దర్శకత్వంలో పవర్ సినిమా తర్వాత రవితేజకు బ్యాడ్ టైమ్ మొదలైంది. 

 

వరుసగా ఫ్లాలపులు అందుకున్నాడు. దాంతో మాస్ మహరాజ రెండేళ్లు గ్యాప్ తీసుకున్నాడు. ఆ రెండు సంవత్సరాల తన ఫిజిక్ విషయం,  ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక రెండేళ్ల గ్యాప్ తర్వతా అనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘రాజా ది గ్రేట్’ మూవీతో మరో బాక్సాఫీస్ హిట్ అందుకున్నాడు.  దాంతో మాస్ మహరాజ ఈజ్ బ్యాక్ అనకున్నారు.  కానీ ఆ తర్వాత కూడా 4 సినిమాలు దారుణమైన ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి.  ఈ మద్య డిస్కోరాజా మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో రవితేజ కెరీర్ పూర్తిగా కష్టాల్లో పడిందని అంటున్నారు టాలీవుడ్ వర్గాలు. 

 

అయితే ఇప్పుడు తన రెమ్యూనరేషన్ విషయంలో రవితేజ కాంప్రమైజ్ అయి తగ్గించుకుంటేనే కొంత కాలం ముందుకు సాగుతాడని.. అదే డిమాండ్ పై ఉంటే ఆయన ఫ్లాపులు శాపంగా మారుతాయని అంటున్నారు సినీ వర్గాలు.  ప్రస్తుతం రవితేజ బలుపు లాంటి హిట్ అందించిన మలినేని తో ‘క్రాక్’ మూవీలో నటిస్తున్నారు.  ఈ మూవీలో రవితేజ సరసన శృతిహాసన్ నటిస్తుంది.  పోలీస్ నేపథ్యంలో సాగే ఈ మూవీపై రవితేజ చాలా ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ ఎంత మంచి హిట్ అవుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: