అప్పటివరకు సినిమా అంటే హీరో ఫైట్లు చేయడం.. హీరోయిన్ తో రొమాన్స్ చేయడం.. ఎమోషన్.. ఇలా అన్నిటిని చేస్తూ వస్తున్నారు. అయితే అప్పటివరకు సంగీత ప్రధాన్యతతో వచ్చిన సినిమా ఏది లేదు. ఎలా వచ్చిందో ఎక్కడ వచ్చిందో తెలియదు కాని శంకరాభరణం సినిమా ఆలోచన తెలుగు సినిమా దశ దిశ మార్చేసింది. సంగీత ప్రధాన్యతతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షక హృదయాలను గెలిచింది. స్టార్ హీరోలు లేరు.. స్టార్ హీరోయిన్ కాదు.. మాస్ ఫైట్లు.. యాక్షన్ సీన్స్ లేకుండా వచ్చి బాక్సాఫీస్ పై తన సత్తా చాటిన సినిమా శంకరాభరణం.

 

70వ దశకంలో మాస్ సినిమాల వెళ్లువలో తెలుగు సినిమా పరిశ్రమ హవా కొనసాగుతుంది.. ఈ టైంలో శంకరారభరణం ఓ మేలి మలుపుగా వచ్చింది. నటీనటులు కూడా అంత పేరున్న వారు కూడా కాదు కాని ఈ సినిమా అశేష ప్రేక్ష హృదయాలను గెలిచి అఖండ ప్రజాదరణ సాధించింది. శాస్త్రీయ సంగీతాభిమానుల ప్రశంసలను పొందింది. సినిమా సంగీతానికి ఎంత ప్రభావింత ఉంటుంది అని చెప్పడానికి శంకరాభరణం సినిమా ఒక ఉదహరణ అందుకే సినిమా వచ్చి నాలుగు దశాబ్ధాలు అవుతున్నా ఇప్పటికి ఆ సినిమాలో పాటలు వింటుంటాం.

 

అప్పటికే సూపర్ హిట్లు కొడుతూ మంచి ఫాం లో ఉన్న కె.విశ్వనాథ్ ఈ సినిమా సక్సెస్ తో కళా తపస్విగా పేరు తెచ్చుకున్నారు. మహదేవన్ సంగీతంలో ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం కూడా ఈ సినిమాలో పాటలు పాడి తెలుగు సినిమా పరిశ్రమలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో విశ్వనాథ్ చేసిన ఓ గొప్ప ప్రయోగం శంకరాభరణం. ఆ సినిమాని ఆదరించడం తెలుగు ప్రేక్షకులు చేసుకున్న ఓ అదృష్టమని చెప్పొచ్చు. ఇప్పటికి సినిమా సంగీతానికి ప్రస్థావించాల్సిన సందర్భం వస్తే అందరు శంకరాభరణం గురించి మాట్లాడుకుంటారని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: